4 August, 2026 | 5:17 PM

యూత్ డెవలప్మెంట్ అవగాహన కార్యక్రమం

04-08-2026 03:59 PM

ఆలేరు,(విజయక్రాంతి): మోటకొండూరు మండలంలోని అమ్మనుబోలు గ్రామంలో ఈరోజు మేరా భారత్ కేంద్రం, నల్గొండ ఆధ్వర్యంలో యూత్ డెవలప్మెంట్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆది జాంబవ యువజన సంఘం, బాలసుధ స్వచ్ఛంద సంస్థ సభ్యులతో కలిసి నిర్వహించిన ఈ కార్యక్రమంలో యువతకు ప్రభుత్వం తరపున అందుతున్న వివిధ సంక్షేమ పథకాలు, ఉపాధి అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు.

యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి సన్మార్గంలో నడుస్తూ, సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని, గ్రామాభివృద్ధికి యువత ముందుండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలేరు మండల యువజన సంఘాల సమితి అధ్యక్షుడు తాళ్లపల్లి మహేష్, బాలసుధ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు, యువ కవి భైరపాక స్వామి, ఆది జాంబవ యువజన సంఘం అధ్యక్షుడు కె మల్లేష్, యూత్ సభ్యులు మహేందర్, రమేష్, శ్రీకాంత్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.