4 August, 2026 | 5:17 PM

కబ్రస్తాన్ నిధులు మంజూరు కోసం రాజిరెడ్డిని కలిసిన ముస్లిం నాయకులు

04-08-2026 04:02 PM

మసాయిపేట్/చేగుంట,(విజయక్రాంతి): మెదక్ జిల్లా మసాయిపేట్ పట్టణ కేంద్రానికి చెందిన ముస్లిం మైనార్టీ నాయకులు మంగళవారం నర్సాపూర్ కాంగ్రెస్ పార్టి ఇంచార్జ్ అవుల రాజి రెడ్డి నివాసంలో  కలిసి పట్టణ కభ్రస్థాన్ (శ్మశానవాటిక) అభివృద్ధికి కొరకు నిధులు మంజూరు చేయాలని  వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్బంగా ముస్లిం నాయకులు మాట్లాడుతూ... పట్టణ కేంద్రంలో ఉన్న కభ్రస్థాన్ చుట్టూ రక్షణ గోడ (ప్రహరీ గోడ) లేకపోవడం, లోపల కంపచెట్లు పెరిగిపోవడం, నీటి వసతి మరియు అంతిమసంస్కారాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు (లైటింగ్, రోడ్లు) సరిగ్గా లేకపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నామని, ప్రహరీ గోడ కోసం నిధులు మంజూరు చేయాలని కోరగా, వెంటనే స్పందించి త్వరలోనే నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారని  వారు తెలిపారు.