యువత అన్ని రంగాల్లో ముందుండాలి
- జిల్లా గుస్సాడీ కళాకారునికి పద్మశ్రీ అవార్డు రావడం గర్వకారణం
- జిల్లా యువజనోత్సవంలో కలెక్టర్ రాజార్షి షా...
ఆదిలాబాద్, నవంబర్ 4 (విజయక్రాం తి): జిల్లా యువత చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించి ఆదర్శంగా నిలవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి యువజనోత్సవాలు కార్యక్రమాన్ని ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
కార్యక్రమంలో విద్యార్థులు, యువత, కళాకారుల ఆకర్షణీయమైన సాం స్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఇన్నోవేషన్ స్టాళ్లును కలెక్టర్ సందర్శించి విద్యార్థుల ప్రతిభను ప్రశంసించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ... ఆదిలాబాద్ జిల్లా అన్ని రంగాల్లో ముందుండాలనే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ కృషి చేయా లన్నారు.
విద్యార్థి దశలోనే మంచి మార్గంలో నడవడం అలవాటు చేసుకోవాలని సూచించారు. అందుకే జిల్లాలో ఆరోగ్య పాఠశాల కార్యక్రమంను ప్రారంభించామని, ఆరోగ్యంగా ఉంటేనే విద్యలో, జీవితంలో విజయం సాధించవచ్చని అన్నారు. ఉన్నత విద్యాపరంగా విద్యార్థులు ఐఐటీ, నీట్, జెఈ లాంటి జాతీయ స్థాయి పోటీలకు సిద్ధం కావాలని సూచించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వారి స్టార్ 50, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పథకాలు అమలులో ఉన్నాయని తెలిపారు.
ఈ అవకాశాలను విద్యార్థులు వినియోగించుకోవాలని సూచించారు. మన దేశ సంస్కృతి, సాంప్రదాయాలు, సంప్రదాయ కళల పట్ల యువతకు అవగాహన కల్పించాలన్నారు. గుస్సాడీ నృత్యానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కళాకారుడు కనక రాజు పొందిన పద్మశ్రీ పురస్కారం మనకు గర్వకారణమని తెలిపారు.
అలాగే మహువ లడ్డుకి ఇటీవల లభించిన జాతీయ స్థాయి గుర్తింపు, ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావన మన జిల్లాకు ప్రత్యేక గౌరవం తీసుకొచ్చాయని కలెక్టర్ గుర్తుచేశారు. మారు మూ ల ప్రాంతాల్లో రక్తహీనత నివారణకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ సలోని చబ్రా, జిల్లా బిసి సంక్షేమ అధికారి రాజలింగు, డివైఎస్‌ఓ శ్రీనివాస్, అధికారులు, విద్యార్థులు, యువత, పోషకులు, కవులు, కళాకారులు, ప్రజలు పాల్గొన్నారు.




