05-11-2025 01:15:40 AM
ప్రకటించిన పీసీసీ అధ్యక్షుడు మహేష్
హైదరాబాద్, నవంబర్ 4 (విజయక్రాంతి) : ఎన్నికల కమిషన్ కో ఆర్డినేషన్ కమిటీని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షినటరాజన్ ఆదేశాల మేరకు పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ మంగళవారం ప్రకటించారు. కమిటీ చైర్మన్‌గా రాజేష్‌కుమార్, కన్వీనగర్‌గా పొన్నం అశోక్‌గౌడ్, సభ్యులుగా జగదీశ్వర్‌రావు, నరేందర్ తన్నీరు, ఎండీ వాజిద్ హుస్సేన్, శషిభూషన్, అబిదేశి సదాలక్ష్మి, శ్రీనివాస్‌రావు, గోపిశెట్టి రాఘవేందర్, అచ్యుత యాదవ్, బైకాని లింగమ్ యాదవ్, జూలురు ధనలక్ష్మి, రేవతిగౌడ్‌లను నియమించారు.