24-04-2025 01:29:46 AM
బీజేపి జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలత రెడ్డి
సూర్యాపేట, ఏప్రిల్ 23(విజయక్రాంతి) : జమ్ము కాశ్మీర్ లోని పహ ల్గాంలో ఉగ్రవాదులు దుశ్చర్యలకు పాల్పడటం అత్యంత హేయమైన చర్యఅని బిజెపి జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలత రెడ్డి అన్నారు. ఉగ్రవాదుల మూకలు పహాల్గంలోని పర్యాటక స్థలంలో సుమారు 28 మంది భారతీయ పౌరులను ఉగ్రవాదులు అత్యంత కిరాతకంగా కాల్చి చంపడాన్ని నిరసిస్తూ జిల్లా బిజెపి శాఖ ఆధ్వర్యంలో ఉగ్రవాదం నశించాలి అంటూ బుధవారం రాత్రి పి ఎస్ ఆర్ సెంటర్ నుంచి కొత్త బస్టాండ్ వరకు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శాంతియుతంగా ఉన్న జమ్ము కాశ్మీర్ ను పాకిస్తాన్ ముసుగులో ఉగ్రవాదులు దాడికి పాల్పడటాన్ని ప్రతి ఒక్కరు ఖండించాలని తెలిపారు. జమ్ము కాశ్మీర్ 370 ఆర్టికల్ ను రద్దు చేయాలని ఉగ్రవాదులు ఈ చర్యలకు పాల్పడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఉగ్రవాదులను తుద ముట్టించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు.
ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పెంచి పోషించడాన్ని ప్రపంచ దేశాలు ఖండించాలని తెలిపారు. ఉగ్రవాదులు కాల్చే సమయంలో భారతీయ పౌరులను మతాన్ని నిర్ధారిస్తూ ఈ చర్యకు పాల్పడటం అమానవీయ చర్యని అభివర్ణించారు. పాకిస్తాన్ ఉగ్రవాదం పేరుతో కవ్వింపు చర్యలకు పాల్పడటాన్ని ధ్వజమెత్తారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ మాజీ చైర్మన్ జుట్టు కొండ సత్యనారాయణ, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి సలిగంటి వీరేందర్, బిజెపి జిల్లా సీనియర్ నాయకులు చలమల్ల నరసింహ, గజ్జల వెంకటరెడ్డి, బిజెపి అసెంబ్లీ అధ్యక్షుడు కర్నాటి కిషన్,అబీద్, పంతంగి సాలయ్య,పర్వతం శ్రీధర్, పర్వతం సంధ్యారాణి, బైరు విజయకృష్ణ, తదితరులు పాల్గొన్నారు