calender_icon.png 10 September, 2025 | 12:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రక్తదానానికి యువత ముందుకు రావాలి

10-09-2025 12:00:00 AM

చిట్యాల,సెప్టెంబర్ 09(విజయ క్రాంతి):అన్ని దానాలలో రక్తదానం చాలా గొప్పదని, అందుకోసం యువత ముందుకు రావాలని  ఎస్త్స్ర జీ.శ్రావణ్ కుమార్ పిలుపునిచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని కైలాపూర్ గ్రామానికి చెందిన క్రీ.శే.సకి నాల కుమారస్వామి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.

కాగా మృతుడి జన్మదినాన్ని పురస్కరిం చుకొని కైలాపూర్ మిత్ర బృందం ఆధ్వర్యంలో  పాఠశాల ఆవరణలో మంగళవారం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ఎస్త్స్ర హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభిం చారు. రక్తదాతలుగా నిలిచిన 30 మంది యువకులు, పోలీస్ కానిస్టేబుళ్లను  అభినందించారు.

కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి ముకిరాల మధువంశీకృష్ణ, నాయకులు పువ్వాటి వెంకన్న,కైలాపుర్ మాజీ సర్పంచ్ చింతల శ్వేత సుమన్, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ అక్షయ్,స్టాఫ్ నర్స్ సౌజన్య,రాజ్ కుమార్, ఆకాష్, ల్యాబ్ టెక్నీషియన్స్ శ్రీకాంత్, సంధ్య, సంతోష్, రాజేందర్, నిర్వాహకులు చింతల మహేందర్, సకినాల రాకేష్, వేముల రాజు, వేముల హరీష్, బోయినీ అజయ్, బుద్ధారపు రవీందర్, చింతల తిరుపతి, సకినాల కిరణ్, ప్రభాకర్ మిత్ర బృందం పాల్గొన్నారు.