calender_icon.png 10 September, 2025 | 9:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెజొనెన్స్‌లో తెలంగాణ భాషా దినోత్సవం

10-09-2025 12:00:00 AM

ఖమ్మం, సెప్టెంబర్ 9 (విజయ క్రాంతి): స్థానిక శ్రీనగర్ కాలనీలోని రెజొనెన్స్ స్కూ ల్లో ప్రజా కవి, ప్రజాసామ్యవాది, మానవతావాది, పద్మవిభూషణ్ కాళోజి నారాయణరా వు జయంతిని పురస్కరించుకొని కాళోజి చి త్రపటాన్ని పూలమాలతో అలంకరించి తె లంగాణ భాషా దినోత్సవ వేడుకలను ఘ నంగా మంగళవారం నిర్వహించడం జరిగినది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్య క్రమంలో డైరెక్టర్ కొండా శ్రీధర్రావు మాట్లాడుతూ  కాళోజి తెలంగాణ ప్రాంత విలువైన సాహిత్యపు ఆస్తి అని పుట్టుక నీది చావు నీది బ్రతుకంతా దేశానిదే అన్న కవి అంటూ అ న్యాయాన్ని ఎదిరిస్తే నా గోడవకు సంతృప్తి, అన్యాయం అంతరిస్తే నా గోడవకు ముక్తి ప్రాప్తి, అన్యాయాన్ని ఎదిరించినోడే నాకు ఆ రాధ్యుడని సూటిగా చెప్పిన మానవతావాది కాళోజి అని అన్నారు.

ఈ కార్యక్రమంలో స్కూల్ డైరక్టర్ కొండా కృష్ణవేణి పాల్గొని మాట్లాడుతూ కాళోజి నారాయణరావు తన జీవితకాలం ఎక్కడ అన్యాయం ఉన్నా, అణచివేయబడుతున్న తాడిత, పీడిత ప్రజల పక్షాన నిలబడి సమాజంలోని సమకాలిన అంశాలను తన కవితలుగా తెలంగాణ యా స, భాషలలో చూపిస్తూ తెలంగాణ భాషా సౌందర్యాన్ని అందరికి అర్ధమైయ్యేలాగా సా మాజిక చైతన్యాన్ని కలిగించిన ఉద్యమకవి అంటూ వారి సాహిత్య సేవను, పోరాటజీవితాన్ని, ప్రజాహితాన్ని తెలియజేస్తూ అందరికి తెలంగాణ భాషా దినోత్సవ శుభా కాంక్షలు తెలియజేసారు.

తెలంగాణ భాషా దినోత్సవ సందర్భంగా స్కూల్లో విద్యార్థులకు ఉ పన్యాస, వ్యాసరచన పోటీలను ని ర్వహించి వాటిలో విజేతలుగా నిలిచిన విద్యార్థిని, వి ద్యార్థులకు బహుమతులను అందజేసి వారి లో తెలంగాణ భాష పట్ల, తెలంగాణ కవుల పట్ల గౌరవాన్ని, ఆసక్తిని పెంపొందింపజేస్తూ వారిలో ఉత్సహాన్ని నిం పుతూ అభినందించ డం జరిగింది.

ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పి.వి.ఆర్. మురళీమోహన్, ఉపాధ్యాయులు ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గోన్నారు.