calender_icon.png 10 September, 2025 | 3:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్యాంక్ సేవలు సద్వినియోగం చేసుకోవాలి

10-09-2025 12:00:00 AM

టేకులపల్లి, సెప్టెంబర్ 9, (విజయక్రాంతి); జిల్లాలో బ్యాంక్ లో అందిస్తున్న సేవలను గ్రామీణ ప్రాంత ప్రజలు సద్వినియోగం చే సుకోవాలని ఎస్బిఐ డిప్యూటీ జనరల్ మేనేజర్‌ఘనశ్యామ్ సోలంకి అన్నారు. మంగళ వారం టేకులపల్లి మండలం లచ్చగూడెం గ్రా మంలో నిర్వహించిన గ్రామ పంచాయతీ స్థాయి సెట్యురేషన్ క్యాంప్ నిర్వహిం చారు.

ఆర్థిక మంత్రిత్వ శాఖ , రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ఆదేశాల ప్రకారం అన్ని గ్రామ పంచాయతీలలో ఈ క్యాంపులు నిర్వహిస్తున్నామని, ప్రధాన మంత్రి జన్ ధన్ ఖా తాలు తెరవడం, జీవనజ్యోతి భీమా యోజ న, సురక్ష భీమా యోజన, అటల్ పెన్షన్ యోజన పథకాల గురించి అవగాహన క ల్పించి నమోదు చేయడం, కె. వై.సి. నమో దు, నామినేషన్ సౌకర్యం, క్లెయిమ్ చేయని డిపాజిట్లపై అవగాహన కల్పించడం, వివిధ బ్యాంక్ పథకాల గురించి అవగాహన కల్పిం చే లక్ష్యంతో ఈ క్యాంపులు నిర్వహిస్తున్నామని తెలియచేశారు.

ఖాతా దారులకు మెరు గయిన సేవలు అందించే విషయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందంజలో ఉందన్నారు.సత్యనారాయణ, రీజనల్ మేనేజర్ మాట్లాడుతూ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేస్తున్నదన్నారు.

మన జిల్లా కలెక్టర్ జిల్లాలోని వివిధ వర్గాల ప్రజలకు మేలు చేసే వి ధంగా మునుపెన్నడూ లేనివిధంగా మంచి కార్యక్రమాలు చేపడుతున్నారని, మునగ, కొరమీను పెంపకం, మేకల పెంపకం, కౌజుపిట్టల పెంపకం , పుట్టగొడుగుల పెంపకం ఇలా ప్రజల ఆదాయాన్ని పెంచే విధంగా కృ షిచేస్తున్నారని, గ్రామీణ యువత కు ఉపాధి అవకాశాలు పెరిగే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని, ఈ ప్రయత్నాలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పూర్తి మద్దతుగా నిలుస్తుందని తెలిపారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వా రా సబ్సిడీ పథకాలు కూడా అందుబాటులో ఉన్నాయని, వాటిని సక్రమంగా ఉపయోగించి ప్రజలు తమ ఆదాయాన్ని పెంచుకో వాలని, సూచించారు. పంట రుణాలు తీసు కున్న రైతులు ప్రతి సంవత్సరం రెన్యువల్ చేయించుకోవాలని తద్వారా తక్కువ వడ్డీ ప్రయోజనం పొందవచ్చని తెలిపారు. తీసుకున్న రుణాలు సక్రమంగా చెల్లించి, రుణ చరిత్ర సరిగా ఉంచుకోవడం ద్వారా బ్యాం కుల నుండి మరిన్ని సౌకర్యాలు పొందే అవకాశం ఉంటుందన్నారు.

రైతులకు, స్వయం సహాయక సంఘాల సభ్యులకు తమ బ్యాంక్ విరివిరిగా రుణాలు ఇస్తున్నట్లు వివరించా రు. ప్రతి వ్యక్తి బ్యాంక్ లావాదేవీలపై అవగాహన పెంచుకుని ఆర్థికంగా దృఢంగా, సుర క్షితంగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారత దేశంలోని అన్ని ప్రాంతాల్లో తమ శాఖల ద్వారా ప్రతి భారతీయుడికి బ్యాంకింగ్ సేవలు అం దిస్తున్నదని, కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందంజలో ఉందని తెలియచేశారు.

జిల్లాలోని ప్రజలకు మరింత మెరు గైన సేవలు అందించే విధంగా తమ శాఖలు, వినియోగదారుల సేవా కేంద్రాలు పనిచేస్తున్నాయని తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇం డియా వారి ఆదేశాల ప్రకారం ఖాతాదారు లు తమ అన్ని శాఖలు, వినియోగదారుల సే వా కేంద్రాల ద్వారా సులభంగా కె . వై . సి. వివరాలు నవీకరించుకోవచ్చని ఆయన తెలిపారు.

జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం జి ల్లాలోని 18 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల వయసు గల ప్రతి వ్యక్తికి ఇన్సూరె న్స్ చేయించాలన్న లక్ష్యంతో తమ అన్ని శా ఖలు పనిచేస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ శ్రీకాంత్ , లీడ్ బ్యాంక్ మేనేజర్ రా మిరెడ్డి, మేనేజర్ (ఎఫ్.ఐ) భానుపద్మ శ్రీ , టేకులపల్లి శాఖ మేనేజర్ ముఖేష్, పంచాయతీ సెక్రటరీ కవిత, సి. యస్.పి. జిల్లా కోఆ ర్డినేటర్ కిషోర్ మరియు సి. యస్. పి లు , ఫ్ .ఓ. ఎస్. కృష్ణ, సి.ఎఫ్.ఎల్.కౌన్సిలర్లు నాగేశ్వరరావు, జగ్య పాల్గొన్నారు.