17 April, 2026 | 2:47 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

యువత సేవా దృక్పథంతో రక్తదానం చేయాలి

30-10-2025 01:07 AM

ఎస్పీ కాంతిలాల్ పాటిల్

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాం తి): యువత సేవదృక్పథంతో రక్తదానం చేయాలని జిల్లా ఎస్పీ కాంతిలాల్ లాల్ పాటిల్ అన్నారు. పోలీస్ అమరవీరుల సం స్మరణ వారోత్సవాల సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం  ఎఎస్పి చిత్తరంజన్‌తో కలసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి ఎస్పీ , ఎఎస్పీ లు రక్తదానం చేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడు తూ రక్తదానం మనిషి చేయగలిగే అత్యున్నత మానవతా సేవ అని, ఈ దానం మరొకరి ప్రాణానికి ప్రాణాధారమవుతుందని తెలిపారు. పోలీసు ఉద్యోగం అంటే కేవలం చట్ట పరిరక్షణ మాత్రమే కాకుండా, ప్రజల జీవన రక్షణ కూడా అని అన్నారు. అమరవీరుల జ్ఞాపకార్థం నిర్వహించే సేవా కార్యక్రమాలు వారికి అర్పించే నిజమైన నివాళి అని తెలిపారు.రక్తదానానికి ముందుకొచ్చిన 103 మంది స్థానిక యువతకు, పోలీస్ అధికారులు, సిబ్బంది, స్పెషల్ పార్టీ సభ్యులకు ఎస్పీ  అభినందనలు తెలిపారు.

వారి సేవాభావం సమాజానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో కాగజ్నగర్ డిఎ స్పీ వాహిదుద్దీన్, సిఐలు, ఆర్‌ఐలు, ఏఆర్ హెడ్క్వార్టర్స్ సిబ్బంది, స్పెషల్ పార్టీ, పోలీస్ స్టేషన్ సిబ్బంది, హోం గార్డులు,  యువత  పాల్గొన్నారు.