యువత రాజకీయాల్లోకి రావాలి
దౌల్తాబాద్,(విజయక్రాంతి): యువత రాజకీయాల్లోకి సమాజంలో మార్పుకు నాంది పలకాలని కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు మద్దెల స్వామి పేర్కొన్నారు. అఖిలా రాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుబ్బాకలో నిర్వహించ తలపెట్టిన రాజకీయ శిక్షణ తరగతులకు సంబంధించిన వాల్ పోస్టర్ ను ఆయన పలువురు నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత సమాజ సేవలో ముందుకు సాగడానికి రాజకీయాలు ఒక సరైన వేదికగా ఉపయోగించుకోవాలని కోరారు.
దానికి సంబంధించిన మెలకువలను నేర్పించాలని ఉద్దేశంతో యువకులకు అఖిలరాజు ఫౌండేషన్ శిక్షణా తరగతులు నిర్వహించడం అభినందనీయం అన్నారు. ఇలాంటి శిక్షణ కార్యక్రమాలను యువత సద్వినియోగం చేసుకొని రాజకీయాలలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. దేశ జనాభాలో యువత ఎక్కువ మొత్తంలో ఉన్నప్పటికీ రాజకీయాలకు దూరంగా జీవనం గడుపుతున్నారని, ఇలాంటి పరిస్థితి మారడానికి ఈ శిక్షణా శిబిరం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ నాయకులు శంభు లింగం గణేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.




