17 April, 2026 | 2:49 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

యువత చెడు వ్యసనాల బారిన పడొద్దు

31-05-2025 07:33 PM

జూనియర్ సివిల్ జడ్జి సాయికిరణ్..

లక్షెట్టిపేట (విజయక్రాంతి): యువత చెడు వ్యసనాల బారిన పడి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని జూనియర్ సివిల్ జడ్జి సాయికిరణ్(Junior Civil Judge Sai Kiran) అన్నారు. శనివారం వరల్డ్ యాంటీ టొబాకో డే(World Anti-Tobacco Day) సందర్భంగా కోర్టు ఉద్యోగులతో ప్రమాణం చేయించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... పొగాకు జీవితాలను నాశనం చేస్తుందన్నారు. పొగాకు వ్యసనానికి గురైతే అది క్యాన్సర్ కు దారి తీస్తుందని, తద్వారా ఆర్థికంగా శారీరకంగా నష్టపోతామని ఆయన వివరించారు.

అనంతరం మోదేల గ్రామంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. రాజీమార్గమే రాజమార్గమని క్షణికావేశంతో చేసిన తప్పులను సరిదిద్దుకొని కోర్టు కేసుల నుండి విముక్తి పొందాలన్నారు. జూన్ 14న ఏర్పాటు చేయనున్న లోక్ అదాలత్ కార్యక్రమాన్ని కక్షిదారులు వినియోగించుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొమిరెడ్డి సత్తన్న, జనరల్ సెక్రటరీ ప్రదీప్ కుమార్, సత్యం, స్థానిక ఎస్ ఐ సురేష్, సీనియర్ న్యాయవాదులు రాజేశ్వరరావు, అక్కల శ్రీధర్, రవీందర్, పద్మ, రెడ్డి మల్ల ప్రకాశం, తదితరులు పాల్గొన్నారు.