07-12-2025 08:27:58 PM
మాజీ ఉపసర్పంచ్ నాయిని శ్రీనివాస్..
కాటారం (విజయక్రాంతి): కాటారం గ్రామానికి చెందిన చార్టెడ్ అకౌంటెంట్ చీర్ల రాజబాపు తండ్రి పోసిరెడ్డి జ్ఞాపకార్థకంగా క్యారం బోర్డును గ్రామ పంచాయతీలోని 1వ వార్డ్ యువతి యువకులకు దాతృత్వంగా అందజేశారు. ఈ సందర్బంగా మాజీ ఉపసర్పంచ్ నాయిని శ్రీనివాస్ శ్రీనివాస్ మాట్లాడుతూ యువతకు, ఉన్న ఊరికి విరాళంగా క్యారమ్ బోర్డ్ అందజేసిన చీర్ల రాజబాపు కుటుంబ సభ్యులను అభినందించారు.
యువత ఆల్కహాల్, గంజాయిలకు అలవాటు పడి ఉజ్వల భవిషత్తును నాశనం చేసుకోవద్దని అన్నారు, అలాగే యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకొని క్రీడల్లో రాణించాలని యువతకు సూచించారు. ఈ కార్యక్రమంలో కాటారం మాజీ ఉపసర్పంచ్ నాయిని శ్రీనివాస్, చీర్ల రాజబాపు, మద్ది సూర్యనారాయణ, గడ్డం కొమురయ్య యాదవ్, పున్నం రమేష్, చిలువెరీ రూపేష్, కోడెల సాయికిరణ్, 1వ వార్డ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.