calender_icon.png 8 December, 2025 | 8:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒక్కసారి ఆశీర్వదిస్తే.. చిరకాలం గుర్తుండేలా సేవలందిస్తా

07-12-2025 08:35:12 PM

సర్పంచ్ అభ్యర్థి వెంకటయ్య..

తాండూరు (విజయక్రాంతి): బ్యాట్ గుర్తుకు ఒక్కసారి ఓటేసి ఆశీర్వదించండి.. చిరకాలం గుర్తుండి పోయేలా సేవలందిస్తానని వికారాబాద్ జిల్లా యాలాల మండలం కోకట్ గ్రామస్తులు, యువకులు, మహిళలు బలపరిచిన స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి వెంకటయ్య అన్నారు. ఆదివారం ఆయన దాదాపు 300 మంది అభిమానులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, గ్రామస్తులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించి హోరెత్తించారు. బ్యాట్ గుర్తుకు ఓటెయ్యాలని ఓటర్లను అభ్యర్థించారు. స్వతంత్ర అభ్యర్థి వెంకటయ్య చేస్తున్న ప్రచారాన్ని చూసి ప్రత్యర్థి పార్టీలు ఆలోచనలో పడ్డాయి. గతంలో ఓ పర్యాయం ఎంపీటీసీ, సర్పంచ్ పదవిని అధిష్టించిన అనుభవం ఉన్న వెంకటయ్యను గ్రామసేవ చేసేందుకు మరో మారు గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉన్నారన్న ప్రచారం జోరుగా జరుగుతుంది.