23-01-2026 05:57:06 PM
ఉప్పల్,(విజయక్రాంతి): నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలని నాచారం కార్పొరేటర్ శాంతి అన్నారు. సుభాష్ చంద్రబోస్ 129 జయంతి సందర్భంగా నాచారం డివిజన్లోని సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఆయన జీవితం దేశభక్తి యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. క్రమశిక్షణ దేశభక్తి దైవభక్తి ఉన్న సేవా తత్పరుడు సుభాష్ చంద్రబోస్ అని ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ బిఆర్ఎస్ నాయకులు సాయిజెన్ శేఖర్ పాండు గౌడ్ మోహన్ రెడ్డి రామకృష్ణ సాయిబాబా అభిషేక్ పాల్గొన్నారు