calender_icon.png 23 January, 2026 | 6:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈనెల 26, 27న సుమతిరెడ్డిలో శ్రీథమ్ 2కె26 వేడుక

23-01-2026 05:53:48 PM

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): హసన్ పర్తి మండలం అనంతసాగర్ లోని సుమతి రెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ప్రతి సంవత్సరం నిర్వహించే సాంస్కృతిక ఉత్సవం శ్రీథమ్ 2కె26 కార్యక్రమాన్ని ఈనెల 26, 27 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఐ. రాజశ్రీ రెడ్డి తెలిపారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ శ్రీథమ్ విద్యార్థుల ప్రతిభను వెలికి తీసే ఒక అద్భుతమైన వేదిక అని సంగీతం, నృత్యం, సాహిత్యం, నాటకం, ఫ్యాషన్ వంటి వివిధ విభాగాల్లో యువత తమ ప్రతిభను ప్రదర్శింపనించేందుకు ఈ ఉత్సవం స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది.

అంతేకాకుండా సృజనాత్మక, న్యాయకత్వ లక్షణాలు, సాంస్కృతిక అవగాహన పెంపొందించడంమే ఈ ఉత్సవ ప్రధాన లక్ష్యమని అన్నారు.అలాగే సాంప్రదాయ దినోత్సవం జరుపుతారని, విద్యార్థులు సాంప్రదాయ వస్త్రాదరణలో పాల్గొని, పాటలు, నృత్యాలు, ఫ్యాషన్ రీల్స్ వంటి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ శ్రీథమ్ ప్రోగ్రాంకి ముఖ్య అతిథులుగా ప్రముఖగాయకులు కశ్యప్ పాల్గొంటారని తెలిపారు.

అంతేకాకుండా వారి త్రెండింగ్ పాటలు, మెలోడీ నంబర్స్, ఎనర్జిటిక్ బీట్ లతో కూడిన లైవ్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనుందని తెలిపారు. ప్రఖ్యాత లైవ్ మ్యూజిక్ గ్రూప్ బ్రాండ్ అరోబి వేదికపై లైవ్ ఇన్ స్ట్రమెంట్, రిథమ్, స్టేజ్ ప్రెజెన్స్  ఉన్నదని తెలిపారు. ఈ లైవ్ మ్యూజిక్ నైట్ ద్వారా విద్యార్థులు ఒత్తిడిని మరిచి ఉత్సాహంతో, ఆనందంతో, సంగీతాన్ని ఆస్వాదించే అవకాశం ఉందని తెలిపారు.