18 April, 2026 | 11:48 AM

యూట్యూబర్ శంకర్ అరెస్టు

30-03-2025 12:55 AM

హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 29 (విజయక్రాంతి): న్యూస్‌లైన్ అనే యూట్యూబ్ ఛానల్ నిర్వా హకుడు శంకర్‌పై అంబర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయింది. శంకర్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగికదాడి చేశాడంటూ ఓ మహిళ అంబర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి విషయంలో బలవంతం చేస్తున్నందుకు తనను బెదిరిస్తు న్నాడని పేర్కొంది. ఈ మేరకు మేరకు శంకర్‌పై కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు.