వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు
బోయినపల్లి (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District) బోయినపల్లి కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు కూస రవీందర్ మాట్లాడుతూ, స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి బడుగు బలహీన వర్గాలకు ఎనలేని కృషి చేశారని అన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో రుణమాఫీ, ఆరోగ్యశ్రీ, మరెన్నో పథకాలను ప్రవేశపెట్టి పేద ప్రజల గుండెల్లో నిలిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు భీమ్ రెడ్డి మహేశ్వర్ రెడ్డి, నాగుల వంశీ, కౌడ గాని వెంకటేష్ ,సంబ లక్ష్మీ రాజం, ఏనుగుల కనకయ్య, నల్లమోహన్, బోయిని పరుశరాములు, ఏనుగుల అనిల్ ఏనుగుల ప్రశాంత్ తదితరులు ఉన్నారు.






