6 April, 2026 | 1:53 PM

వైఎస్సార్ ఆస్తులు పంచలేదు

30-10-2024 02:28 AM

వైఎస్సార్ అభిమానులకు విజయమ్మ బహిరంగ లేఖ

హైదరాబాద్, అక్టోబర్ 29 (విజయక్రాంతి): వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌కు, ఆయన సోదరి ఏపీసీసీ చీఫ్ షర్మిల మధ్య కొనసాగుతున్న ఆస్తుల పంపకం వివాదంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.

వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సంపాదించిన ఆస్తిలో ఆయన ఇద్దరు బిడ్డలు జగన్, షర్మిలకు సమాన వాటా ఉంటుందని విజయమ్మ స్పష్టంచేశారు. ఆస్తుల వివాదంపై స్పందించిన విజయమ్మ వైఎస్సాఆర్ అభిమానులకు మంగళ వారం బహిరంగ లేఖ రాశారు. 

విజయసాయికి అన్నీ తెలుసు 

‘ఆస్తుల పంపకం మీద వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి ఎన్నో అసత్యాలు చెప్పారు. వైఎ స్సాఆర్ బతికి ఉండగానే ఆస్తులు పంచేశారని అన్నారు. ఇది అవాస్తవం. వైఎస్సాఆర్ కొన్ని ఆస్తులను షర్మిల పేరిట, మరికొన్ని ఆస్తులను జగన్ పేరిట పెట్టారు. ఇది ఆస్తులు పంచడం కాదు. వైఎస్ బతికి ఉండగానే షర్మిలకు ఆస్తులు ఇచ్చేశారు అని లిస్ట్ చదివారు.

అలాగే జగన్ పేరు మీద పెట్టిన ఆస్తుల లిస్ట్ చదివి ఉండాల్సింది.  విజయసాయిరెడ్డి ఆడిటర్‌గా ఉన్నా రు కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు. సుబ్బారెడ్డి ఈ ఇంటి బంధువుగా ఎంవోయూపై సాక్షి సంతకం చేశారు. అయినా మీడియాలో అబద్ధాలు మాట్లాడటం నాకు బాధ కలిగించింది. అందుకే నిజం చెప్తున్నా.’

జగన్‌కు 60 శాతం..

‘డివిడెంట్ రూపంలో జగన్ వాటా తీసుకొని, రూ.200 కోట్లు షర్మిల భాగానికి ఇచ్చారు. ఎంవోయూ ప్రకారం జగన్‌కు 60 శాతం, షర్మిలకు 40 శాతం అయితే, ఎంవోయూకు ముందు సగం సగం డివిడెంట్ తీసుకునేవారు. ఎందుకుంటే షర్మిలకు సమాన వాటా ఉంది కాబట్టి. వీటన్నింటికీ అప్పుడూ, ఇప్పుడూ నేనే సాక్షిని. 2019 వరకు కలిసి ఉన్న కుటుంబం ఆస్తుల పరంగా విడిపోవాలని నిర్ణయం జరిగింది.

విజయవాడలో నా సమక్షంలోనే ఆస్తుల్లో ఇవి జగన్‌కు, ఇవి షర్మిలకు అని అనుకున్నారు. 2019లో రాసిన ఎంవోయూనే ఈ ఎంవోయూ. ఇది జగన్ చేతితో రాసిన ఎంవోయూనే. హక్కు ఉంది గనుకే షర్మిలకు 200 కోట్ల డివిడెండ్ ఇచ్చా రు. అటాచ్‌మెంట్‌లో లేవు కాబట్టి ఎంవోయూలో ఉన్న సరస్వతి షేర్స్ 100 శాతం, ఎలహంక ప్రాపర్టీ 100 శాతం పాపకు వెంటనే ఇస్తానని జగన్ అప్పుడే మాట ఇచ్చి సంతకం పెట్టాడు.

అటాచ్‌మెంట్‌లో లేని ఆస్తుల విషయంలోనూ పాపకు అన్యాయం జరిగింది. పాప భాగానికి వచ్చిన భారతి సిమెంట్స్, సాక్షి మీడియా, వైఎస్సార్ ఇల్లు.. ఇలాంటివి కేసుల తరువాత ఇవ్వాల్సి ఉంటుంది. అన్నాచెల్లెలు వారి సమస్యను పరిష్కరించుకుంటారని లేఖలో పేర్కొన్నారు.