28 August, 2026 | 2:07 PM

Breaking News

జర్నలిస్టులకు రాఖీ కట్టి.. హెల్మెట్లు అందించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్   •   రక్షాబంధన్‌ పండుగ.. మన బంధాలకు ప్రతీక: ఎమ్మెల్యే పాయల్‌ శంకర్   •   బసవరాజు శ్రీనివాస్ పై నీలాప నిందలు మానేయండి   •   సీఐ అత్యుత్సాహం.. ఆందోళనకారులపై దాడి   •   శిశుమందిర్ విద్యార్థుల సౌభ్రాతృత్వ సందేశం   •   ముత్తారం మాజీ జడ్పీటీసీని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు   •   కిక్కిరిసిన బస్సులు.. కిటకిటలాడుతున్న బస్టాండ్లు   •   మాజీ మంత్రి కోట్నాక భీంరావు వర్ధంతిని విజయవంతం చేయాలి   •   జర్నలిస్టులకు రాఖీ కట్టిన ఎస్సై గుగులోత్ శ్రీదేవి   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మహాధర్నా   •  

వైఎస్‌ఆర్ ఆశయాలే కాంగ్రెస్‌కు స్ఫూర్తి

09-07-2026 01:33 AM

మండల అధ్యక్షులు నవీన్ కుమార్ 

చేగుంట జూలై 8: చేగుంట మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి వై . ఎస్ . రాజశేఖర రెడ్డి జయంతిని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు  వడ్ల నవీన్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చేపట్టిన సంక్షేమ పథకాలు, రైతు సంక్షేమం, ఆరోగ్యం, విద్య రంగాలకు చేసిన సేవలు చిరస్మరణీయమని నాయకులు పేర్కొన్నారు.

వైఎస్‌ఆర్ ఆశయాల సాధనే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని, ప్రజా సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తామని తెలిపారు. అనంతరం కార్యకర్తలకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మసాయిపేట్ శ్రీనివాస్ ముజామిల్, అన్నం ఆంజనేయులు, మెహన్ నాయక్, సండ్రుగు స్రవంతి సతీష్,చౌదరి శ్రీనివాస్, రఫీ, కుర్మ లక్ష్మి, కార్యకర్తలు పాల్గొన్నారు.

తెల్లాపూర్ డివిజన్ పరిధిలో.. 

రామచంద్రపురం, జూలై 8: రామచంద్రపురం మండలం  తెల్లాపూర్ డివిజన్ పరిధి లోని వైఎస్‌ఆర్ జయంతి సందర్బంగా కాంగ్రెస్ పార్టీ  డివిజన్  అధ్యక్షులు సి.ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో వైయస్‌ఆర్ అభిమానులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.