వైఎస్సార్ సేవలు చిరస్మరణీయం
జిల్లాలో ఘనంగా 77వ జయంతి వేడుకలు
షాద్ నగర్/ శంకర్పల్లి /ఆమనగల్లు జూలై 8 (విజయక్రాంతి):ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి వేడుకలను శంకర్ పల్లి, షాద్ నగర్, ఆమనగల్లు, చేవెళ్ల తదితర ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాల ప్రధాన కూడళ్లలో ఉన్న వైఎస్సార్ విగ్రహాలకు ప్రజాప్రతినిధులు, నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.పేదల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగించి, ఎన్నో అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టిన ఘనత వైఎస్సార్దేనని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య కొనియాడారు.
పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను తెలుసుకొని, ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూర్చిన మహానేతగా వైఎస్సార్ జనం గుండెల్లో దేవుడై నిలిచిపోయారని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పేర్కొన్నారు.ఈ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు, వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో యువనేత శీలం శ్రీను నేతృత్వంలో వైఎస్సార్ విగ్రహానికినివాళులర్పించారు. మున్సిపల్ చైర్మన్లు సాత ప్రవీణ్ కుమార్, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి పట్టణ అధ్యక్షుడు అవారి శివలింగం ,అగ్గునూరు బస్వం, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు మరియు పెద్ద సంఖ్యలో అభిమానులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఘనంగా వైఎస్‌ఆర్ జయంతి
ఘట్ కేసర్, జూలై 8 (విజయక్రాంతి) : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఘట్ కేసర్ డివిజన్ అధ్యక్షులు బొక్క ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు బుధవారం ఘనంగా నిర్వహించారు. వైయస్సార్ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
రైతు భరోసా నిధులు దాదాపు రూ. 7500 కోట్ల 68 లక్షలు రైతు బ్యాంకు ఖాతాల్లో వేసిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇంచార్జ్ మంత్రి శ్రీధర్ బాబు చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు.
ఈకార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, సెక్రటరీ మామిండ్ల ముత్యాల్ యాదవ్, మున్సిపల్ మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ పాల్గొనగా మాజీ కౌన్సిలర్ కడపోల్ల మల్లేష్, మాజీ సర్పంచ్ లు మేడబోయిన వెంకటేష్ ముదిరాజ్, బద్దం గోపాల్ రెడ్డి, నాయకులు కొంతం అంజిరెడ్డి, కొంతం రాంరెడ్డి, బర్ల దేవేందర్ ముదిరాజ్, మీసాల సుధాకర్ రావు, వి.బి. వెంకటనారాయణ ముదిరాజ్,
మెట్టు రమేష్, ఉల్లి ఆంజనేయులు యాదవ్, మీసాల మల్లేష్, బొక్క సుధాకర్ రెడ్డి, బొక్క సంజీవరెడ్డి, మేకల సునీల్ కుమార్, ఫరూక్, ఎం. శ్రీనివాస్, సురేష్ నాయక్ రెహమాన్, ఖయ్యాం, తోక మల్లేష్, కడపోల్ల బ్రదర్స్ రాజు, సుధాకర్, కె. మాధవరెడ్డి, బాబు రావు, తదితరులు పాల్గొన్నారు.






