9 July, 2026 | 2:04 AM

రామగిరి మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవ

09-07-2026 01:12 AM

రూ.2 కోట్లతో బేగంపేటఖిల్లా రహదారి పనులు మంజూరు!

ఇప్పటికే రూ.5 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు వేగవంతం

రామగిరి అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం

మంత్రి శ్రీధర్ బాబుపై స్థానిక ప్రజలు, పర్యాటకుల హర్షాతిరేకాలు

పెద్దపల్లి, జూలై 7 (విజయక్రాంతి): చారిత్రక వైభవానికి, ఆధ్యాత్మిక సంపదకు ప్రతీకగా నిలిచిన రామగిరి తెలంగాణలోనే అగ్రగామి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా మంత్రి శ్రీధర్ బాబు ఇప్పటికే రూ. 5 కోట్ల భారీ నిధులను మంజూరు చేయించి, పనులను యుద్ధప్రాతిపదికన పరుగులు పెట్టి స్తున్నారు.

రవాణా కష్టాలకు చెక్.. రూ.2 కోట్లతో రహదారి పనులు!

ఖిల్లాకు వచ్చే పర్యాటకులు, భక్తుల రవాణా సౌకర్యార్థం మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా రా మగిరి మండలంలోని బేగంపేట నుంచి రామగిరి వరకు సులభంగా చేరుకునేలా రూ. 2 కోట్ల నిధులతో సరికొత్త రహదారి నిర్మాణ పనులను మంజూరు చేశారు. ప్రస్తుతం ఈ రోడ్డు పనులు అత్యంత వేగంగా చకచకా సాగుతున్నాయి. దీనితో పాటు, రత్నాపూర్ గ్రామ శివారులోని హార్టికల్చర్ కార్యాలయం నుంచి రామగిరి వరకు మరో ప్రత్యామ్నాయ రహదారి నిర్మాణానికి కూ డా మంత్రి నిధులు కేటాయించారు. ఈ రెండు రహదారులు అందుబాటులోకి వస్తే ప ర్యాటకుల రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి.

ప్రాచీన దేవాలయాల పునరుద్ధరణ

కేవలం రహదారులే కాకుండా, ఉన్న చారిత్రాత్మక ప్రాచీన దేవాలయాల అభివృద్ధిపై మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. భక్తులకు అవసరమైన మౌలిక వసతుల కల్పన, పరిసరాల సుందరీకరణ పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

ప్రజల హర్షం

చారిత్రక, ప్రకృతి అందాల నిలయమైన రామగిరి రాష్ట్ర పర్యాటక పటంలో అగ్రస్థానంలో నిలిపేందుకు మంత్రి శ్రీధర్ బాబు తీసుకుంటున్న శ్రద్ధ అభినందనీయం. ఆయన చొరవతో జరుగుతున్న ఈ పనులు పూర్తయితే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు, ఈ ప్రాంత రూపురేఖలు మారిపోతాయి‘ అని స్థానిక ప్రజలు, పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

శ్రావణమాసంలోకు పర్యాటకులు, భక్తుల సందడిప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో రామగిరికు పర్యాటకులు, భక్తుల సందడి మొదలు కానుంది. దీంతో ఖింతో సమీపాల్లోని బేగంపేట, రత్నపూర్, గ్రామాలలో నుండి పర్యాటకులు వస్తారు. ముందుచూపుతోనే మంత్రి శ్రీధర్ బాబు ఈ గ్రామాలలో రహదారులు నిర్మాణం చేపట్టారు పర్యటకులకు ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కల్పించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రామగిరిల్లా అభివృద్ధితో తమ గ్రామాల రూపురేకులు మారనున్నాయి ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి చేస్తున్న మంత్రి శ్రీధర్ బాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు

దాసరి శివ కాంగ్రెస్ పార్టీ నాయకుడు

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రత్యేక దృష్టి పెట్టి రామగిరిను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే ఐదు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారని, ఖిశారని సమీపాల్లోని బేగంపేట గ్రామం నుంచి చ్‌ంచి వరకు పర్యటకులు వెళ్లేందుకు మంత్రి రెండు కోట్లతో రోడ్డును మంజూరు చేయించారని, ఇప్పటికే బేగంపేటకు అధిక నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్న మంత్రి శ్రీధర్ బాబుకు బేగంపేట గ్రామ ప్రజల తరుపున దాసరి శివ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.