21-08-2025 06:08:27 PM
ఇండస్ట్రీలోకి కొత్త నీరు రావాలంటుంటారు. కొత్త కథా రచయితలు, దర్శకులు వస్తే మరింత కొత్త కథలు పుట్టుకొస్తుంటాయి. అందుకే కొత్త టాలెంట్ హంట్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ 'జీ5' నిర్వహిస్తోంది. కథా రచయితలు, దర్శకుల ఎంపిక కోసం జీ టీమ్ ఆడిషన్స్ నిర్వహిస్తోంది. 'జీ రైటర్స్ రూమ్' పేరుతో ఈ ఆడిషన్స్ ఆగస్టు 30న హైదరబాద్‌లోని సారథి స్టూడియో సమీపంలోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఈ ఆడిషన్స్ కొనసాగుతాయి. మరిన్ని వివరాల కోసం 9397397771 మొబైల్ నంబర్ ద్వారా తమ టీమ్‌ను సంప్రదించాలని జీ5 చీఫ్ కంటెంట్ ఆఫీసర్ అనురాధ గూడుర్ తెలిపారు.