calender_icon.png 21 August, 2025 | 10:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐసిఈయు వరంగల్ యూనియన్ భవన నిర్మాణ శంకుస్థాపన

21-08-2025 08:33:30 PM

హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): హనుమకొండ వివేక్‌నగర్ కాలనీ, 100 ఫీట్ల రోడ్డులో వరంగల్ డివిజన్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ స్వంత భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐఐఈఏ కార్యదర్శి శ్రీకాంత్ మిశ్రా, ఎస్సిజెడ్ఐఈఎఫ్ అధ్యక్షుడు పి. సతీష్, ఎస్సీజెడ్ఐఈఎఫ్ ప్రధాన కార్యదర్శి టీవీఎన్ఎస్ రవీంద్రనాథ్, సంయుక్త కార్యదర్శి జి. తిరుపతయ్య, జి డబ్ల్యూ ఎం సి 56వ డివిజన్ కార్పొరేటర్ సిరంగి సునీల్ కుమార్ లు పాల్గొని శంకుస్థాపన చేశారు. అనంతరం హనుమకొండ హరిత హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో ఐసిఈయు వరంగల్ డివిజన్ అధ్యక్షుడు బలభక్తుల శ్రీహరి అధ్యక్షతన ఉద్యోగుల సమావేశం జరిగింది.

అనంతరం వారు మాట్లాడుతూ... యాజమాన్యంతో ఇటీవల జరిగిన చర్చల వివరాలను తెలియజేశారు. యూనియన్ భవన నిర్మాణం ఉద్యోగుల సంఘటిత శక్తికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. అనేక ఒడిదుడుకులను అధిగమించి ఈ చారిత్రాత్మక తొలి అడుగును విజయవంతంగా పూర్తి చేయడం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐ సి ఈ యు వరంగల్ డివిజన్ ప్రధాన కార్యదర్శి మర్రి ప్రభాకర్, డివిజన్ కోశాధికారి రేష్మ, సంయుక్త కార్యదర్శి ఈ. చంద్రశేఖర్, ఉమెన్స్ సబ్ కమిటీ కన్వీనర్ అమ్మాజీ, డివో బేస్ యూనియన్ అధ్యక్షురాలు సంధ్యారాణి, కార్యదర్శి వి. శ్రీకర్ రెడ్డి, సిహెచ్ పాపిరెడ్డి, జె. కుమార్ రాజు, ఆర్. భగవాన్ కుమార్, పి. సదానందం, ఆలిండియా, జోనల్ స్థాయి యూనియన్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.