calender_icon.png 21 August, 2025 | 10:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకుల హాస్టల్ లో సౌకర్యాలు మెరుగ్గా ఉండాలి

21-08-2025 08:31:36 PM

హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్..

హనుమకొండ (విజయక్రాంతి): గురుకుల హాస్టల్ లో సౌకర్యాలు మెరుగ్గా ఉండాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్(District Collector Sneha Shabarish) అన్నారు. గురువారం హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండ శివారులోని తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, కళాశాలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్లోని డైనింగ్ హాల్, ప్రాంగణం, స్టోర్ రూమ్, తరగతి గదులను కలెక్టర్ పరిశీలించారు. హాస్టల్ నిర్వహణకు సంబంధించిన పలు రికార్డులను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. కిచెన్ రూమ్ లో కూరగాయలు, పప్పులు, వంట నూనెలు, తదితర నిత్యావసరాలను కలెక్టర్ తనిఖీ చేసి తాజా కూరగాయలు, నాణ్యమైన వంట పదార్థాలను వంటల్లో వినియోగించాలన్నారు. డైనింగ్, వాష్ ఏరియా ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉండాలన్నారు.

తరగతి గదులను పరిశీలించిన కలెక్టర్ ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీ విద్యార్థులతో మాట్లాడారు. ఎంసెట్, నీట్ వంటి పోటీ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్ విద్యార్థులతో అన్నారు. దీనిపై పలువురు విద్యార్థులు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే పుస్తకాలు కావాలని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా పోటీ పరీక్షల పుస్తకాలను అందజేస్తానని అన్నారు. విద్యార్థులలో చాలామంది ఇంజినిరింగ్, వైద్య సీట్లను తప్పనిసరిగా సాధించాలన్నారు. అదేవిదంగా ఆర్ట్ రూంలో విద్యార్థులు వేసిన పెయింటింగ్స్ బాగున్నాయని కలెక్టర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమన్వయ అధికారి దాసరి ఉమామహేశ్వరి, కాజీపేట తహసీల్దార్ భావ్ సింగ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.