జోరుగా జీరో ఇసుక దందా?
వే బిల్లులు లేకుండానే తిరుగుతున్న లారీలు
రాత్రికి రాత్రే అక్రమంగా తరలింపు
భారీగా ఆదాయం కోల్పోతున్న టీజీఎండీసీ
స్థానికుల బెదిరింపులతో 20 రీచ్‌లు మూసివేసిన టీజీఎండీసీ
హైదరాబాద్, మార్చి 21 (విజయక్రాంతి): జిల్లాల్లో జీరో ఇసుక దందా మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగుతోంది. జీరో ఇసుక దందాపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సీరియస్‌గా మందలించినా.. జీరో ఇసు క దందాకు పుల్‌స్టాప్ పడడం లేదు. ఫలితం గా రాష్ట్ర ఖజానాకు భారీగానే గండి పడుతోంది.
రాష్ట్రంలోని ఆయా ఇసుక రీచ్‌లల్లో స్థానికంగా ఉండే కొందరు ప్రజా ప్రతినిధలు బెదిరింపులకు పాల్పడుతున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో టీజీఎండీసీ పరిధిలో ఉండే 20 ఇసుక రీచ్‌లు ప్రస్తుతం నవడడం లేదని తెలుస్తోంది. ఇసుక రీచ్‌లు బంద్ కావడంతో.. ఇసుక డీడీల విక్రయాలను టీజీఎం డీసీ సంస్థ నిలిపివేసినట్టుగా తెలిసింది.
అయితే, ఇదే అదునుగా స్థానికంగా ఉండే కొందరు ప్రజా ప్రతినిధులు ఆయా రీచ్ నుంచి అక్రమంగా ఇసుకను లారీల్లో తరలి స్తూ జీరో దందా నడుపుతూ సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 10 రోజుల క్రితం మైనింగ్‌కు సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి దగ్గర సమీక్ష జరి గింది. కొన్ని జిల్లాలో స్థానిక ప్రజా ప్రతినిధులు రీచ్‌లను నడవకుండా అడ్డుకుంటు న్నారని, తద్వారా టీజీఎండీసీ ఆదాయానికి గండిపడుతుందనే విషయాన్ని సంబంధిత ఉన్నతాధికారులు సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలిసింది.
అయితే రీచ్‌ల నుంచి ఇసుకను తరలింపును అడ్డుకునే వారు ఎవరైనా? ఏ ప్రజా ప్రతినిధి అయినా కేసులు పెట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి పోలీసు ఉన్నతాధికారులను, విజిలెన్స్ అధికారులను ఆ దేశించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 46 ఇసుక రీచ్‌లకు గాను 26 రీచ్‌లు మాత్రమే ఇసుకను విక్రయిస్తుండగా మరో 20 రీచ్‌లు మాత్రం మూసివేసినట్టుగా తెలిసింది. మూసివేసిన రీచ్‌ల్లో ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబ్‌నగర్, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ల్లో ఉన్నట్టుగా సమాచారం.
లారీలపై విజిలెన్స్ దాడులు
అయితే కొందరు ప్రజాప్రతినిధులు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలను బేఖాతర్ చే యడం లేదని, జీరో దందా కింద ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారన్న ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి. ఇదే విషయమై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందుతుండడంతో ప్ర స్తుతం కొన్ని జిల్లాలో వే బిల్లులు లేకుండా అక్రమంగా తిరుగుతున్న ఇసుక లారీలపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి.. ఇసుక లారీలపై కేసులను నమోదు చేస్తున్నారు.
దీంతోపాటు ప్రస్తుతం మూసివేసిన ఆ 20 ఇసుకరీచ్‌ల్లో టీజీఎండీసీ ఇసుకను విక్రయించడానికి కసరత్తు చేస్తున్నా.. కొందరు ప్రజా ప్రతినిధులు టీజీఎండీసీ అధికారులకు సహకరించడం లేదని తెలుస్తోంది. ఒకవేళ తమను కాదని ఇసుక రీచ్‌లను తెరి స్తే లారీలను అడ్డుకుంటామని, స్థానికంగా రీచ్‌లలో అధికారులు, సిబ్బంది విధులు ని ర్వహించకుండా చూస్తామని ప్రజాప్రతినిధులు బెదిరిస్తున్నట్టుగా తెలిసింది. ఈ నేప థ్యంలోనే ప్రస్తుతం మూసివేసిన ఇసుకరీచ్‌లను టీజీఎండీసీ అధికారులు ఓపెన్ చేయ కుండా అలాగే వదిలేసినట్టుగా సమాచారం.
రింగ్‌గా మారుతున్న కాంట్రాక్టర్లు
ప్రస్తుతం ఇసుకరీచ్‌లను కొన్నేళ్లుగా కొం దరు కాంట్రాక్టర్లే దక్కించుకోవడం, రీచ్‌ల టెండర్లలో పారదర్శకత లేకపోవడం, కొం దరు కాంట్రాక్టర్లే రింగ్‌గా మారి ఎక్కువగా రీ చ్‌లను దక్కించుకోవడం వల్లే ఆ సంస్థ ఆ దాయం కోల్పోతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతోపాటు ప్రస్తుతం టీజీ ఎండీసీ ఎండీ ఎండి భవేశ్‌మిశ్రా వేరే శాఖ ల్లో అదనపు బాధ్యతలు నిర్వర్తించడం.. ఈ శాఖపై పూర్తిస్థాయి సమయాన్ని కేటాయించకపోవడం వల్లే ఇసుకరీచ్‌ల వద్ద జరు గుతున్న అక్రమాలపై ఆయన దృష్టి సారించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
దీంతోపాటు ఇసుక రీచ్‌ల వద్ద పీవోలుగా పనిచేయడానికి రెవెన్యూ శాఖ నుండి డిప్యూటేన్‌పై రావడానికి చాలామంది ఉత్సాహం చూపుతున్నారు. దీంతో వారు డిప్యూటేషన్ వచ్చినప్పటి రోజుకు లక్షల రూపాయలను దండుకుంటూ సంస్థకు చెడ్డపేరు తీసుకువస్తున్నారు.ప్రస్తుతం టీజీఎండీసీ సంస్థకు చెం దిన వారిలో 9 మంది మాత్రమే ఆ శాఖ ఉ ద్యోగులు ఉండగా మిగతా వారంతా వేరే శా ఖ నుంచి డిప్యూటేషన్ వచ్చి ఈ సంస్థ ఆదాయాన్ని కొల్లగొడుతున్నారని ఆ శాఖ ఉద్యోగులు ఆరోపిస్తుండడం విశేషం.
ఫిబ్రవరి నాటికే రూ.910 కోట్లు..
టీజీఎండీసీ సంస్థ ఫిబ్రవరి నాటికి రూ.910 కోట్ల ఆదాయాన్ని ఆర్జించగా ఈనెలాఖరు నాటికి అది రూ.1,000 కోట్లకు చేరుకుంటుందని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. అయితే, రానున్న ఆర్థిక సంవత్సరం 2026 27 గాను రూ.1,300 కోట్ల ఆదాయాన్ని రాబట్టాలని ప్రభుత్వం నిర్ధేశించినట్టుగా తెలిసింది.




