11 July, 2026 | 3:51 AM

ఫుట్‌పాత్‌లపై అనధికార నిర్మాణాల తొలగింపు

11-07-2026 02:31 AM

డీఎల్‌ఎఫ్ పరిసర ప్రాంతాల్లో జోనల్ కమిషనర్ అమిత్ ప్రత్యేక డ్రైవ్

శేరిలింగంపల్లి, జూలై 10 (విజయక్రాంతి): గచ్చిబౌలి డీఎల్‌ఎఫ్ పరిసర ప్రాంతాల్లో ఫుట్పాత్లపై ఉన్న అక్రమ నిర్మాణాలను పాదచారులు, వాహనదారుల సురక్షిత ప్రయాణం కోసం జోనల్ కమిషనర్ అమిత్ నేతృత్వంలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టి అక్రమ షెడ్లను తొలగించారు. గత కొంత కాలంగా డీఎల్‌ఎఫ్, గచ్చిబౌలి ప్రాంతాల్లోని ప్రధాన రోడ్లు ఫుట్పాత్లు అనధికార నిర్మాణాలు, షెడ్లు, దుకాణాలు, ఇతర అడ్డంకులతో నిండిపోయి పాదచారులు ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిన జోనల్ కమిషనర్ అమిత్ స్వయంగా ఈ డ్రైవ్ను ప్రారంభించారు.

ఆక్రమించిన ప్రదేశాలను ఖాళీ చేయించి, బహిరంగ స్థలాలను పునరుద్ధరించడం ద్వారా ప్రజల సౌకర్యాన్ని పెంపొందించారు. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ అమిత్ మాట్లాడుతూ, పాదచారులు సురక్షితంగా నడవడం, వాహనాలు సులభంగా వెళ్లడం మా లక్ష్యం. నగర నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని బహిరంగ ప్రదేశాలను ఆక్రమణలు లేకుండా ఉంచడంలో ప్రజలందరూ సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.