పత్తి ధర పైపైకి.. రైతుల్లో హర్షం

28-11-2026 | 04:42pm

నిర్మల్, నవంబర్ 28 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో తెల్లబంగారంగా పిలిచే పత్తికి మార్కెట్లో మంచి ధర లభిస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర (MSP) క్వింటాల్‌కు రూ.8,667 ఉండగా, భైంసా మార్కెట్లో (Cotton Market) క్వింటాల్‌కు రూ.9,250 ధర పలుకుతోంది. భారత పత్తి సంస్థ (CCI) కొనుగోళ్లతో సంబంధం లేకుండానే మార్కెట్లో ధరలు పెరుగుతుండటంతో రైతులు (Farmers) హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వారం రోజుల క్రితం క్వింటాల్ పత్తికి రూ.8,800 ధర ఉండగా, ప్రస్తుతం రూ.450 పెరిగి రూ.9,250కు చేరింది. మద్దతు ధర (Support Price) కంటే అధిక ధర లభిస్తుండటంతో పత్తి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు