నల్ల్లా లేక వృథాగా పోతున్న నీరు
- నీటి వృధా వద్దు... పొదుపు మాత్రమే ముద్దు
- మిషన్ భగీరథ నీటి లీకేజీలపై సర్కార్ దృష్టి
- గ్రామాల్లో చాటింపు
- వృథా చేస్తే జరిమానా
నిర్మల్, నవంబర్ 1 (విజయ క్రాంతి) : ఎల్ నినో పరిస్థితుల(El Niño conditions) నేపథ్యంలో నిర్మల్ జిల్లాలో తాగునీటిపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎల్ నినో పరిస్థితులు, మండిపోతున్న ఎండలు, తగ్గిపోతున్న భూగర్భ జిల్లాలు, తాగు నీటి వనరుల్లో నీటి లభ్యత ను పరిగణలోకి తీసుకున్న జిల్లా యంత్రాంగం భవిష్యత్తులో నీటి కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టింది.
జిల్లావ్యాప్తంగా మిషన్ భగీరథ, పట్టణ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి శుద్ధ జలం అందిస్తున్న నేపథ్యంలో మిషన్ భగీరథ అధికారులు నీటి వృధా, పొదుపుపై గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయనున్నారు.
నిర్మల్ జిల్లాలో మొత్తం 18 మండలాలు, నిర్మల్ బైంసా ఖానాపూర్ మున్సిపాలిటీ లో మిషన్ భగీరథ, పట్టణ భగీరథ ద్వారా ప్రతిరోజు శుద్ధ జలం అందిస్తున్నారు. జిల్లాలోని 630 ఆవాసాలకు మిషన్ భగీరథ ద్వారా మీరు అందించేందుకు మిషన్ భగీరథ అధికారులు ప్రత్యేక కార్యచరణ రూపొందించుకుని అమలు చేస్తున్నారు
నీటి పొదుపు లీకేజీలపై ప్రత్యేక దృష్టి
నిర్మల్ జిల్లాలో మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందించేందుకు అవసరమైన నీటి వనరులు ఉన్నప్పటికీ భవిష్యత్తులో నీటి కొరూతా ఏర్పడకుండా మిషన్ భగీరథ అధికారులు నీటి పొదుపు లీకేజీలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. జిల్లాలో బైంసా గడ్డన్న వాగు ప్రాజెక్టు ద్వారా ముధోల్ నియోజకవర్గం లో, ఎస్సారెస్పీ ద్వారా నిర్మల్ నియోజకవర్గంలో, కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు ద్వారా ఖానాపూర్ కడెం దస్తురాబాద్ పెంబి మిషన్ భగీరథ ద్వారా శుద్ధ జలం అందిస్తున్నారు.
అయితే ఈ ప్రాజెక్టులో ఈ వేసవికి సరిపోయే తంతా నీరు ఉండగా భవిష్యత్తులో నీటి కొరత ఏర్పడకుండా అన్ని గ్రామాల్లో తాగునీటి సరఫరా చేసే పైప్లైన్లు, ఇంటర్ పైప్ లైన్లు, గ్రామాల్లో ప్రతి ఇంటికి ఏర్పాటుచేసిన మిషన్ భగీరథ నల్ల పైపులైన్ల పైదృష్టి పెట్టారు.
ఇప్పటికీ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాథోడ్ రమేష్ మిషన్ భగీరథ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సందీప్ కుమార్, డిపిఓ శ్రీనివాస్, విద్యుత్ శాఖ పర్యవేక్షకు ఇంజనీర్ రమేష్, సమన్వయం చేసుకుంటూ తాగునీటిపై ఇబ్బందులేకుండా చర్యలు తీసుకుంటున్నారు.
మిషన్ భగీరథ ద్వారా జిల్లాలో సుమారు 500 ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకుల్లో నీళ్లు నింపి ప్రతిరోజు సమయపాలన పాటిస్తూ నేటి వృధాలు అరికడుతున్నారు. ప్రతి జిపి లో నీటి సరఫరా చేసే పైప్ లైన్ లో లీకేజీ ఉంటే దాన్ని వెంటనే మూసివేయాలని సూచిస్తున్నారు. నల్ల కలెక్షన్ వారికి నల్ల పెట్టుకోవాలని లేకుంటే నల్లని రద్దు చేస్తామని హెచ్చరిస్తున్నారు.
ఇప్పటికే గ్రామపంచాయతీలో ఈ విషయమై పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా భూగర్భ జిల్లాలు కూడా తగ్గాయి. జిల్లాలో ప్రతినెల 42 డిజిటల్ వాటర్ మిషన్ కేంద్రాల్లో భూగర్భ జలాలను లెక్కిస్తుండగా ఈసారి అక్టోబర్ మాసంలో మూడు మీటర్ల నీటిమట్టం పడిపోయిందని అధికారులు చెప్తున్నారు. గత ఏడాది ఇదే సీజన్లో ఐదు మీటర్లు ఉండగా ఇప్పుడు 8 మీటర్లకు పడిపోయింది
వృధాపై ప్రజల్లో చైతన్యం
నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఏనిల్లో పరిస్థితులు, భూగర్భ జలాల కొరత, మిషన్ భగీరథ నీటిని పొదుపుగా వాడుకునేందుకు జిల్లా యంత్రాంగం పెద్ద ఎత్తున గ్రామాల్లో ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. జిల్లా పంచాయతీ, మిషన్ భగీరథ అధికారులు, భూగర్భ జల శాఖ అధికారులు, గ్రామాల్లో ప్రతిరోజు డప్పు చాటింపు చేపడుతున్నారు.
గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి నీటి పొదుపు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నారు. నీటి వృధా చేయవద్దని వృధా చేయటం వల్ల భవిష్యత్తులో నీటి అవసరాలు ఇబ్బందిగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో యువకులు మహిళా సంఘాల్లో సమావేశం నిర్వహించి చర్యలు తీసుకుంటున్నారు.
మిషన్ భగీరథ కు కరెంటు సరఫరా కొడత లేకుండా విద్యుత్ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని మిషన్ భగీరథ నీరు అందిస్తున్నారు. మిషన్ భగీరథలో పనిచేసే అధికారులను అప్రమతం చేసి 24 గంటలు అత్యవసర సేవలు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.
మండల స్థాయిలో జిల్లా స్థాయిలో ప్రత్యేక అధికారుల్ని ఏర్పాటు చేసి సాగునీటిపై దృష్టి పెట్టిన నేపథ్యంలో ప్రజలు కూడా మిషన్ భగీరథ లీకేజీ ఇంటి వద్ద ఉన్న నల్లలకు కుడ్డీలు ఏర్పాటు చేయడం, లీకేజీలను అరికట్టడం, గ్రామాల్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవడం వంటివి చేపడుతున్నారు.
నీటిని పొదుపుగా వాడుకోవాలి
జిల్లాలో కరువు పరిస్థితుల నేపథ్యంలో మిషన్ భగీరథ, పట్టణ భద్రత నీటి వృధాపై ప్రత్యేక దృష్టి పెట్టినం. జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలో సిబ్బందిని అప్రమత్తం చేసిన. గ్రామాల్లో ఉన్న లీకేజీలను మూసి వేస్తున్నాం.
ప్రస్తుతం ప్రాజెక్టులో తాగునీటి అవసరాలకు సరిపడే నీటి వనరులు ఉన్న భవిష్యత్తులో నీటి కోరుతా ఏర్పడకుండా ముందస్తు చర్యలు తీసుకున్నాం. ప్రజలు కూడా ప్రతిరోజు అవసరాల మట్టుకే మిషన్ భగీరథ నీటిని వాడుకోవాలి. వీటిని వృధా చేయవద్దు. గ్రామాల్లో మిషన్ భగీరథ అధికారులు ఏ సమస్య వచ్చినా 24 గంటల్లో పరిష్కరించేలా చర్యలు తీసుకున్నాం.
-పి. సందీప్ కుమార్ , మిషన్ భగీరథ ఈ ఈ