బాల్య వివాహాలు భవిష్యత్తుకు చేటు
పాస్టర్ రెవరెండ్ ఎస్ విజయ రావు
ఖానాపూర్ (విజయక్రాంతి) : బాల్య వివాహాలు(Child Marriages) భవిష్యత్తులో చాలా చేటు చేస్తుందని, కుటుంబం నిలబడాలన్నా, సమాజం మంచి మార్గంలో నడవాలన్నా ఆరోగ్యకరమైన సమాజం కావాలన్నా ,స్త్రీ ఆరోగ్యం చాలా ముఖ్యమని ,ఖానాపూర్ సి.ఎస్.ఐ చర్చ్ పాస్టర్ ఎస్ విజయ రావు(Pastor S. Vijaya Rao, CSI Church, Khanapur) అన్నారు. శనివారం నిర్మల్ జిల్లా(Nirmal District) ఖానాపూర్ మండలం సత్తెనపల్లి రైతు వేదికలో బేటి బచావో బేటి పడావో కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు.
ఈ మేరకు వివాహ సమయంలో సమాజంలో ఆడపిల్లల వయసు కచ్చితంగా చూడాలని, 18 వయసు దాటాకే వివాహం జరిపించాలని దానికోసం విధిగా టెన్త్ మెమో, ఆధార్ కార్డు ,ఆధారాలు చూడాలని బాల్యవివాహాలు నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరి వంతుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు .ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక మహిళలు పలువురు పాల్గొన్నారు.