ట్రిపుల్ ఐటీలో ఎన్-జెన్ పోస్టాఫీస్ సేవలు
28-11-2026 | 10:05pm
భైంసా,(విజయక్రాంతి): ఆర్జీయూకేటీ బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్(RGUKT Basar Triple IT Campus)లో శనివారం ఎన్-జెన్ పోస్టాఫీస్(N-Gen Post Office)ను విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎ. గోవర్ధన్ ప్రారంభించారు. విద్యార్థి దశ నుంచే చిన్న మొత్తాలతో పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలని సూచించారు. నేటి పొదుపు భవిష్యత్తులో ఆర్థిక భద్రతకు పునాది అవుతుందని పేర్కొన్నారు. ఈ సూపరింటెండెంట్ ఎ. సుబ్రహ్మణ్యం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎస్. రాజేశ్వర్, భైంసా ఇన్‌స్పెక్టర్ పోస్ట్స్ జె. దిలీప్ కుమార్, పోస్టల్ అధికారులు, సిబ్బంది, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.