ప్రైవేట్ ఫైనాన్స్పై పోలీసుల దాడులు
- నిజామాబాద్ జిల్లాలో విస్తృతంగా తనిఖీలు
- 42 చోట్ల చెక్కులు, ప్రామిసరీ నోట్లు, బాండ్ పేపర్లు లభ్యం
నిజామాబాద్, అక్టోబర్ 17 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లాలో అక్రమ ఫైనాన్స్లపై(Illicit finance) శనివారం పోలీసులు మెరుపు దాడులు చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు ఆర్మూర్, బోధన్ సబ్ డివిజన్ కేంద్రాల్లో మూకుమ్మడిగా దాడులు నిర్వహించారు. 67 ప్రాంతాల్లో అనుమానిత వడ్డీ వ్యాపారుల ఇల్లు కార్యాలయాలలో తనిఖీలు చేపట్టారు. 42చోట్ల చెక్కులు, ప్రామిసరీ నోట్లు, బాండ్ పేపర్ లు, నగదు, తదితర కీలక పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు దాడులు నిర్వహించారు. బాధితులు ఫిర్యాదుల మేరకే పోలీసులు తనిఖీలు నిర్వహించినట్లు తెలుస్తోంది. భూములు రిజిస్ట్రేషన్ చేసుకుని వడ్డీ వ్యాపారులు అడ్డగోలుగా సొమ్ము చేసుకుంటున్నారని ఫిర్యాదులు రావడంతో ఏకకాలంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. సీపీ సాయి చైతన్య మాట్లాడుతూ ఆక్రమ వడ్డీ వ్యాపారాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరిని వేధించినా సమాచారం ఇవ్వాలని సూచించారు. బెదిరించడం, బలవంతంగా పత్రాలు తీసుకోవ డం, అధిక వడ్డీ వసూలు చేయడం చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు.