రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు తూంపల్లి విద్యార్థులు

28-11-2026 | 04:55pm

సిరికొండ, నవంబర్ 28 (విజయక్రాంతి): మండలంలోని తూంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు (State Level Hockey) ఎంపికైనట్లు పీడీ సడక్ నగేష్ తెలిపారు. ఎస్‌జీఎఫ్ (SGF) అండర్‌-14 విభాగంలో మారుతి, రణధీర్, విజయ్, దివాకర్, నిశ్వంత్, రిత్విక్ ఎంపికైనట్లు వెల్లడించారు.

రాష్ట్రస్థాయి పోటీలు (Hockey Tournament) ఈనెల 28 నుంచి 30వ తేదీ వరకు వనపర్తి జిల్లాలో జరగనున్నట్లు తెలిపారు. పోటీలకు ఎంపికైన విద్యార్థులను సిరికొండ మండల విద్యాశాఖ అధికారి (MEO) పి.రాములు, పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడు మనోహర్, ఉపాధ్యాయ బృందం, సర్పంచ్ రాజేందర్, ఉపసర్పంచ్ శ్రీకాంత్ అభినందించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచి విజయం సాధించాలని ఆకాంక్షించారు

మరిన్ని వార్తలు