అద్దెదారులకు యజమాని వేధింపులు

18-11-2026 | 11:58am

భవనం మొత్తం ఖాళీ చేయాలంటూ ఒత్తిడి

విద్యా సంవత్సరం మధ్యలో ఎలా వెళ్లాలంటూ బాధితుల ఆవేదన

మణికొండ,(విజయక్రాంతి): గత ఐదేళ్లుగా నివాసముంటూ ప్రతినెలా సకాలంలో అద్దె చెల్లిస్తున్న కుటుంబాలను భవనం మొత్తం ఖాళీ చేయాలంటూ యజమాని ఒత్తిడి చేస్తున్నారని అద్దెదారులు ఆరోపిస్తున్నారు. నాలుగు అంతస్తుల భవనంలో నివాసముంటున్న కుటుంబాలను ఇళ్లు ఖాళీ చేయాలని వేధిస్తున్నారని వాపోతున్నారు.

ముఖ్యంగా పాఠశాల విద్యా సంవత్సరం మధ్యలో ఇళ్లు ఖాళీ చేయాల్సి వస్తే పిల్లల చదువులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భవన నిర్మాణ అనుమతులపై అధికారులు విచారణ జరిపి, తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు