రత్నాపూర్లో కొత్త 5 ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభం
మంథని, నవంబర్ 10(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా(Peddapalli District) మంథని డివిజన్ పరిధిలోని రామగిరి ఆపరేషన్ సెక్షన్ రత్నాపూర్ గ్రామంలోని 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రంలో(Electrical Substation) అదనంగా ఏర్పాటు చేసిన 5 ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ను మంగళవారం మధ్యాహ్నం 2.05 గంటలకు ఛార్జింగ్ చేశారు. ట్రాన్స్ఫార్మర్ను ఛార్జింగ్ చేసిన అనంతరం నిర్వహించిన పరీక్షల్లో పనితీరు సంతృప్తికరంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
అదనపు ట్రాన్స్ఫార్మర్ అందుబాటులోకి రావడంతో పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా సామర్థ్యం మెరుగుపడనుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎస్ఈ ఆపరేషన్స్ వి. గంగాధర్, మంథని డీఈ ఆపరేషన్స్ వి. ప్రభాకర్, పెద్దపల్లి డీఈ ఎంఆర్టీ కమ్ కంట్రోల్ కె. శ్రీనివాసరెడ్డి, ఏఈ ట్రాన్స్ఫార్మర్ పెద్దపల్లితో పాటు విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.