నూతన పాలకవర్గాలు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేయాలి
కోనరావుపేట,(విజయక్రాంతి): రైతుల సంక్షేమం, ప్రజా సమస్యల పరిష్కారం, గ్రామాల అభివృద్ధికి నూతన పాలకవర్గాలు కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్(State Whip Adhi Srinivas) అన్నారు. గురువారం కోనరావుపేట మండలంలో పర్యటించిన ఆయన కొలనూరులో రూ.20 లక్షలతో నిర్మిస్తున్న గ్రామపంచాయతీ భవనానికి, రూ.10 లక్షలతో నిర్మించిన మహిళా సమాఖ్య భవనానికి ప్రారంభోత్సవం చేశారు.
అనంతరం మండల కేంద్రంలోని రైతు వేదికలో 25 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులుKalyana Lakshmi Checks() పంపిణీ చేసి, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన పాలకవర్గ అభినందన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సకాలంలో అందేలా చూడాలని, ధాన్యం కొనుగోళ్లు మద్దతు ధరకు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం రైతు సంక్షేమం, విద్య, సాగునీరు, గ్రామీణ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ప్రజా సమస్యలను గుర్తించి పరిష్కరించడంలో నూతన పాలకవర్గాలు బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ చైర్మన్లు చేపూరి గంగాధర్, బొమ్మన భాస్కరరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శిలు షేక్ ఫిరోజ్ ఫాష, గొట్టె రుక్మిణి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు బోయిన దేవరాజు, పార్టీ మండల అధ్యక్షులు మానుక సత్యం, ఫ్యాక్స్ డైరెక్టర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, సర్పంచులు, ఉప సర్పంచ్లు, సీఈఓ కేశవులు, సిబ్బంది, గ్రామస్తులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.