బాల్యవివాహ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

27-11-2026 | 05:33pm

తంగళ్ళపల్లి, నవంబర్ 26(విజయ క్రాంతి ): బాల్యవివాహాలు, ముందస్తు మరియు బలవంతపు వివాహాల(Forced marriages) నిర్మూలనపై తంగళ్లపల్లిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మోర లక్ష్మీరాజం, ప్రధానోపాధ్యాయులు శంకర్ నారాయణ,

ఎస్ఐ అశోక్ మాట్లాడుతూ బాల్యవివాహాల వల్ల చిన్నారుల చదువు, ఆరోగ్యం, భవిష్యత్తు దెబ్బతింటాయని పేర్కొన్నారు. బాల్యవివాహాలను అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. బాలల హక్కులను పరిరక్షిస్తూ బాల్యవివాహ రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రజలు, అధికారులు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మహిళలు, పాఠశాల సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు