శిథిలావస్థలో తహసీల్దార్ కార్యాలయం.. పట్టించుకోని అధికారులు
18-11-2026 | 01:16pm
బేల,(విజయక్రాంతి): బేల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం శిథిలావస్థకు చేరుకోవడంతో కార్యాలయానికి వచ్చే ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భవనం గోడలు దెబ్బతినడం, పైకప్పు పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
ప్రతిరోజూ వివిధ పనుల నిమిత్తం పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ కార్యాలయానికి వస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో శిథిలావస్థలో ఉన్న భవనంలో విధులు నిర్వహించడం ఉద్యోగులకు కూడా ఇబ్బందికరంగా మారింది. సంబంధిత అధికారులు స్పందించి నూతన తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.