దీక్షా దివస్‌కు భారీ జనసమీకరణ చేయాలి

18-11-2026 | 02:23pm

29న అలుగునూరులో బహిరంగ సభ.. పోస్టర్ ఆవిష్కరించిన కొండూరు రవీందర్‌రావు

గంభీరావుపేట నవంబర్ 18 (విజయక్రాంతి): ఈనెల 29న కరీంనగర్ జిల్లా అలుగునూర్ చౌరస్తాలో నిర్వహించనున్న దీక్షా దివస్(Deeksha Divas) బహిరంగ సభను విజయవంతం చేయాలని నాఫ్స్‌కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్‌రావు పిలుపునిచ్చారు. గంభీరావుపేటలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాపగారి వెంకటస్వామి గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యతో కలిసి దీక్షా దివస్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి గ్రామం నుంచి భారీగా జనసమీకరణ చేయాలని, డప్పు చాటింపు, బొట్టు పెట్టే కార్యక్రమాలు, కరపత్రాల పంపిణీ చేపట్టాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన దీక్ష కీలక మలుపుగా నిలిచిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలులో విఫలమైందని విమర్శించారు.

పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ గౌరీనేని నారాయణరావు, గంధ్యాడపు రాజు, కొమిరిశెట్టి లక్ష్మణ్, అంజిరెడ్డి, పెద్దవేని వెంకట్ యాదవ్, లింగం యాదవ్, కమ్మరి రాజారాం, సుతారి సంపూర్ణ, సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు