స్వగ్రామంలో దసరా వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్

21-10-2026 | 03:03pm

ఆది శ్రీనివాస్

రుద్రంగి అక్టోబర్ 21(విజయక్రాంతి) : రుద్రంగిలో(Rudrangi) ఘనంగా జరిగిన దసరా వేడుకల్లో(Dasara Celebration) ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్(Adi Srinivas) పాల్గొన్నారు. ముందుగా శ్రీ లక్ష్మీరసింహస్వామి(Sri Lakshmi Narasimha Swamy) వారిని దర్శించుకొని పత్యేక పూజలు(Special prayers) నిర్వహించారు. అనంతరం స్వామివారిపల్లకి సేవాను స్వయానా బుజాలపై మోసి స్వగ్రామంపై ఇలావేల్పు శ్రీ లక్ష్మీనరసింహ స్వామిపై ఉన్న భక్తిని అభిమానాన్ని చాటుకున్నారు.అనంతరం గ్రామంలోని ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.

దసరా వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేసినా సర్పంచ్ కు మరియు పాలవర్గ సభ్యులకు ఆలయ కమిటీ సభ్యులకు పోలీస్ అధికారులకు అభినందనలు తెలియజేశారు.అ దుర్గాదేవి ఆశీస్సులతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని వేడుకున్నట్టు తెలిపారు.

మరిన్ని వార్తలు