దేవుడి భూమికే.. ‘నాలా’ ముసుగు
- ఇర్విన్లో 27 గుంటల ఆలయ ఆస్తి స్వాహా?
- అధికారుల మౌనంపై నిప్పులు చెరుగుతున్న గ్రామస్తులు
- కలెక్టర్ తక్షణమే విచారణ జరిపించాలని డిమాండ్
రంగారెడ్డి బ్యూరో, నవంబర్ 7(విజయక్రాంతి): భక్తుల(devotees) విశ్వాసాలకు నిలయమైన దేవుడి ఆస్తులకే రక్షణ కరువైంది. రంగారెడ్డి జిల్లా(Ranga Reddy District) మాడ్గుల మండలం ఇర్విన్ గ్రామంలోని ప్రాచీన శ్రీ చెన్నకేశవస్వామి దేవాలయానికి(Sri Chennakesavaswamy Temple) చెందిన కోట్లాది రూపాయల విలువైన భూమి అక్రమార్కుల(Land grabbers) చేతుల్లోకి వెళ్తు న్నట్లు వెలువడుతున్న కథనాలు స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. సర్వే నంబ ర్ 11లోని 27 గుంటల దేవాలయ స్థలాన్ని ఒక వ్యాపారి అక్రమంగా నాలా కన్వర్షన్ చేయించి నిర్మాణాలు చేపడుతున్నా.. రెవెన్యూ, దేవాదాయ శాఖల అధికారులు(Officials from the Revenue and Endowments departments) కళ్ళు అప్పగించి చూడటంపై సర్వత్రా విమర్శలు వెళ్ళు వెత్తుతున్నాయి.
27 గుంటల దేవుడి భూమి....
ఇర్విన్ గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 11లో చెన్నకేశవస్వామి ఆలయానికి 27 గుంటల భూమి రికార్డుల్లో ఉంది. అ యితే, రెవెన్యూ అధికారుల అండదండలతో నే ఒక వ్యాపారి ఈ భూమికి నాలా అనుమతులు పొంది అక్రమ నిర్మాణాలు ప్రారంభిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. భూమి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించకుండానే నాలా కన్వర్షన్కు అనుమతులు ఎలా ఇచ్చారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.అధికారుల పనితీరుపై వెల్లువెత్తుతున్న ప్రశ్నలు.
దేవాదాయ శాఖ మౌనం వెనుక మర్మమేమిటి?....
ఆలయ ఆస్తులను, భూములను కాపాడాల్సిన దేవాదాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయికి వచ్చి పరిశీలించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాలా కన్వర్షన్ అనుమతులెవరిచ్చారు? సర్వే నంబర్ 11లోని భూమి దేవాలయానికి చెందినదని తెలిసినా నాలా అనుమతులు ఎలా మంజూరయ్యాయనే దానిపై సమగ్ర విచారణ జరగాల్సి ఉంది.అక్రమ నిర్మాణాలు పూర్తయ్యే వరకు వేచి చూస్తారా? ఆలయ స్థలంలో నిర్మాణాలు పూర్తయ్యాక నోటీసుల పేరుతో కాలయాపన చేయడం అక్రమార్కులకు పరోక్షంగా సహాకరిస్తుందని విమర్శలు వస్తున్నాయి.
అక్రమ నిర్మాణాలను తక్షణమే నిలిపివేయాలి.... గ్రామస్తుల డిమాండ్
దేవుడి భూములను ఆక్రమించే వారిపై మరియు వారికి సహకరించిన అధికారులపై జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఇర్విన్ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.సర్వే నంబర్ 11 భూ రికార్డులను వెంటనే రీ-వెరిఫై చేయాలి.ప్రస్తు తం జరుగుతున్న అక్రమ నిర్మాణాలను వెంటనే నిలిపివేసి, నాలా కన్వర్షన్ అనుమతులను రద్దు చేయాలి.ఆలయ భూమిని తిరి గి దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకుని పరిరక్షణ చర్యలు చేపట్టాలి. జిల్లా కలెక్టర్ మరి యు ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి ఇర్విన్ చెన్నకేశవస్వామి ఆలయ భూమికి రక్షణ కల్పించాలని, నిర్లక్ష్యం వహించిన అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.