ఫూలే సామాజిక సంస్కర్త

28-11-2026 | 10:14pm

- ఎల్బీనగర్ నియోజకవర్గంలో జ్యోతిబాఫూలే వర్ధంతి

 - నివాళులర్పించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, నాయకులు 

ఎల్బీనగర్, నవంబర్ 28 : మహాత్మా జ్యోతిబాఫూలే(Mahatma Jyotiba Phule) సామాజిక సంస్కర్త, విద్యావేత్త, సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి(MLA Sudheer Reddy) అన్నారు. ఫూలే 136వ వర్ధంతి సందర్భంగా శనివారం ఉదయం ఎల్బీనగర్(LB Nagar) కూడలిలోని ఆయన విగ్రహానికి  పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాత్మా జ్యోతిబా ఫూలే సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి, మహిళా విద్యకు, సామాజిక సమానత్వం కోసం పోరాడారని అన్నారు.

కార్యక్రమంలో కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం మాజీ ధర్మకర్త చాతిరి మధుసాగర్, లోహిత్ పాల్గొన్నారు. సీనియర్ నాయకులు జక్కిడి ప్రభాకర్ రెడ్డి, గంట శ్రవణ్, విఠల్ రెడ్డి, మున్నా జానీ, శ్యామల్ రెడ్డి, పృథ్వీ రాజ్, నాగరాజు తదితరులు ఫూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. హైకోర్టు కాలనీలో బీజేపీ డివిజన్ అధ్యక్షుడు మర్రి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఫూలే వర్ధంతిలో హయత్‌నగర్ మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పారంద మహేష్, పార్వతి, వెంకన్న, గోవింద చారి, గీత, ఓంకార్, కిరణ్, సాయి, యాదయ్య, నరేన్, వనజ, మంజుల  పాల్గొన్నారు.  మహేశ్వరం నియోజకవర్గం రామకృష్ణాపురం డివిజన్ రామకృష్ణాపురం కాలనీ చౌరస్తాలో పూలే 136వ వర్ధంతి నిర్వహించారు.

కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు పున్న గణేష్ నేత, నాయకులు పగడాల ఎల్లన్న,  కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి చిలక ఉపేందర్ రెడ్డి,  గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ బండి మధుసూదన్ రావు, రాష్ట్ర బీసీ నాయకుడు గట్ల రవీంద్ర, ఎన్టీఆర్ నగర్ డివిజన్ అధ్యక్షుడు ముప్పిడి లింగస్వామి గౌడ్, శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం చైర్మన్ తలాటి రమేష్ నేత తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు