'కామినేని'లో ‘ప్లెక్సస్’ అకడమిక్ సదస్సు

28-11-2026 | 10:31pm

- 26 వైద్య కళాశాలల నుంచి 287 మంది ప్రతినిధులు హాజరు 

- మోడల్ హెల్త్ అసెంబ్లీ, క్లినికల్ నైపుణ్యాలపై వర్క్‌షాప్‌ 

ఎల్బీనగర్ , నవంబర్ 28 : ఎల్బీనగర్‌లోని(LB Nagar) కామినేని అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్(Kamineni Academy of Medical Sciences and Research Centre) ఆధ్వర్యంలో నవంబర్ 27, 28 తేదీల్లో ‘ప్లెక్సస్  – కామ్స్ఆర్‌సీ అకడమిక్ కాన్క్లేవ్’ అంతర్ కళాశాల సదస్సు నిర్వహించారు. తెలంగాణ వ్యాప్తంగా 26 వైద్య కళాశాలలకు(Medical colleges) చెందిన 287 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. అండర్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యార్థుల(graduate medical students) మధ్య విద్యా విషయ మార్పిడి, పరస్పర సహకారం, ఆచరణాత్మక నైపుణ్యాల పెంపొందించడమే లక్ష్యంగా సదస్సును నిర్వహించారు. 

వివిధ కళాశాలలకు చెందిన భావి వైద్యులు తమ ఆలోచనలను పంచుకోవడానికి, తోటి విద్యార్థుల నుంచి నేర్చుకోవడానికి, విద్యాపరమైన సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ప్లెక్సస్ చక్కని వేదికగా నిలిచింది.  ప్లెక్సస్‌లో పలు క్లినికల్ స్కిల్ వర్క్‌షాప్‌లు నిర్వహించారు. ముఖ్యంగా సూచరింగ్, ఈసీజీ, రేడియాలజీ, మెడికల్ ఇమేజింగ్, ట్రామా మేనేజ్‌మెంట్,  సీపీఆర్ అంశాలపై వర్క్ షాప్ నిర్వహించారు.

ఈ సందర్భంగా కామినేని హాస్పిటల్స్(Kamineni Hospitals) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ గాయత్రి కామినేని మాట్లాడుతూ.. “వైద్య విద్య కేవలం తరగతి గది బోధనకే పరిమితం కాకుండా, విద్యార్థులు తమ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడానికి, క్లినికల్ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి, పరస్పర సహకారంతో నేర్చుకోవడానికి అవకాశాలను కల్పించాలన్నారు.

ప్రిన్సిపాల్ డాక్టర్ సుధీర్ బాబు పద్గుల్ మాట్లాడుతూ.. “అండర్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యార్థులు ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవడానికి, ఆరోగ్య రంగ సవాళ్లను అర్థం చేసుకోవడానికి, వైద్య వృత్తికి అత్యవసరమైన నైపుణ్యాలను బలోపేతం చేసుకోవడానికి ప్లెక్సస్ ఒక ముఖ్యమైన వేదిక అన్నారు.

మరిన్ని వార్తలు