పార్కుతో ఆహ్లాదకర వాతావరణం
- ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
ఎల్బీనగర్, నవంబర్ 28 : పార్కులతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందని, పార్కులను నిత్యం పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎంపీ ఈటల రాజేందర్(MP Eatala Rajender), ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి(MLA Sudheer Reddy) అన్నారు. వనస్థలిపురం(Vanasthalipuram) డివిజన్ పరిధిలోని శ్రీ శ్రీనివాసపురం కాలనీలో నూతన పార్కును కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు దూసరి మధు గౌడ్ ఆధ్వర్యంలో ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు చింతల రవికుమార్, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, కుంట్లూరు వెంకటేశ్ గౌడ్, రాజేశ్ గౌడ్, వేణు, యాదగిరి, యాదయ్య, సుమన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, సాయికుమార్, వేణుగోపాల్ రెడ్డి, బాల్ రెడ్డి, రతన్ రాజ్, ఆంజనేయులు, ఆతుల్ షిండే తదితరులు పాల్గొన్నారు.