అండాల అక్రమ దందాలో కార్పొరేట్‌ పెద్దలు

28-11-2026 | 10:12pm

- ఓయాసిస్‌ ఫెర్టిలిటీకి చెందిన ఇద్దరు కీలక అధికారుల అరెస్టు

- దేశవ్యాప్తంగా 43 కేంద్రాల్లో అండాల సేకరణ

- నెలకు రూ.28 కోట్ల ఆదాయం, డాక్టర్లకు లక్షల్లో వేతనాలు 

- మహిళల అక్రమ రవాణాపై కఠిన చర్యలు 

- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి 

ఎల్బీనగర్, నవంబర్ 28 : అండాల అక్రమ(Illegal egg trade) దందాలో కార్పొరేట్‌ పెద్దలు(Corporate leaders) ఉన్నారని, ఓయాసిస్‌ ఫెర్టిలిటీ(Oasis Fertility) కేంద్రంగా జరిగిన అండాల అక్రమ సేకరణ, మహిళల అక్రమ రవాణా కేసులో ఇద్దరు కీలక నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి(Malkajgiri Police Commissioner Sumathi) తెలిపారు. శనివారం ఎల్బీనగర్ లోని క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. మహిళల అండాలను అక్రమంగా సేకరించి, వ్యాపారంగా మార్చుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓయాసిస్‌ ఫెర్టిలిటీ నెట్‌వర్క్‌లో మరో ఇద్దరు కీలక వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.

సద్గురు హెల్త్‌కేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ ప్రతిక్‌ అనిల్‌ గగ్లానీ (44), మెడికల్‌ అడ్మినిస్ట్రేటర్‌ డాక్టర్‌ రాజర్షి దేబ్‌ (53)ని సరూర్‌నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. వీరి విచారణలో దేశవ్యాప్తంగా విస్తరించిన అండాల సేకరణ నెట్‌వర్క్‌, భారీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చినట్లు వెల్లడించారు.

- దేశవ్యాప్తంగా 43 కేంద్రాల్లో అనైతిక వ్యాపారం హైదరాబాద్‌లో సద్గురు హెల్త్‌కేర్‌ ఆధ్వర్యంలో పది ఓయాసిస్‌ ఫెర్టిలిటీ కేంద్రాలు నిర్వహిస్తున్నట్లు విచారణలో గుర్తించారు. వీటిలో బంజారాహిల్స్‌, మియాపూర్‌, సికింద్రాబాద్‌, దిల్‌సుఖ్‌నగర్‌లో నాలుగు లెవల్‌-2 ఐవీఎఫ్‌ కేంద్రాలు ఉన్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఏజెంట్ల ద్వారా మహిళలను సమీకరించి అండాల సేకరణకు వినియోగించినట్లు ఆరోపణలున్నాయి. మియాపూర్‌లోని ఏఆర్‌టీ బ్యాంకు ఇన్‌ఛార్జి సునీల్‌రాయ్‌ ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినట్లు పేర్కొన్నారు. 

- నెలకు 100 అండాల సేకరణ లక్ష్యం 

సద్గురు హెల్త్‌కేర్‌ ఆధ్వర్యంలో  దేశవ్యాప్తంగా సంస్థ నిర్వహిస్తున్న 43 క్లినిక్‌లలో ప్రతినెలా సుమారు 600 స్వీయ చికిత్సా చక్రాలు, మరో 100 అండాల దాన ప్రక్రియలు జరుగుతున్నట్లు వివరించారు. వీటి ద్వారా నెలకు రూ.27-28 కోట్ల ఆదాయం వస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళలకు అండాల ఉత్పత్తిని ప్రేరేపించే హార్మోన్‌ మందులు, ఇంజెక్షన్లు ఇచ్చి తదుపరి వైద్య ప్రక్రియలకు పంపినట్లు విచారణలో వెలుగుచూసింది.

- రూ.487 కోట్ల లావాదేవీలు

సద్గురు హెల్త్‌కేర్‌ సంస్థకు సంబంధించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఖాతాను పరిశీలించిన పోలీసులు కీలక విషయాన్ని గుర్తించారు. 2026 ఏప్రిల్‌ 1 నుంచి నవంబర్‌ 26 వరకు జరిగిన డెబిట్‌, క్రెడిట్‌ లావాదేవీల మొత్తం విలువ రూ.487.82 కోట్లుగా తేలింది. ఈ భారీ లావాదేవీలపై పోలీసులు మరింత లోతుగా ఆరా తీస్తున్నారు.

- యాజమాన్యం సూచనలతో అండాల సేకరణ 

ప్రతిక్‌ గగ్లానీ సద్గురు హెల్త్‌కేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ గా 2025 నుంచి పని చేస్తున్నాడు. ఫెర్టిలిటీ కేంద్రాల నిర్వహణ, వైద్య పరికరాల కొనుగోలు, నిధుల సమీకరణ, కార్యకలాపాల పర్యవేక్షణలో కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు తెలిపారు. మరో నిందితుడు డాక్టర్‌ రాజర్షి దేబ్‌... ఫెర్టిలిటీ కేంద్రాల్లో వైద్యుల నియామకాలు, ఆపరేషన్‌ థియేటర్ల నిర్వహణ, వైద్యపరమైన కార్యకలాపాలను పర్యవేక్షించినట్లు వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధమైన విధానాలకు అంగీకరించే వైద్యులను నియమించాలని యాజమాన్యం సూచించినట్లు ఆయన వాంగ్మూలంలో పేర్కొన్నారని పోలీసులు తెలిపారు.

అధిక వేతనాలు, ఆర్థిక ప్రయోజనాల కోసమే ఈ వ్యవహారాల్లో పాల్గొన్నట్లు ఇద్దరు నిందితులు వెల్లడించారని వివరించారు. అండాల అక్రమ సేకరణ కేసులో ఇప్పటి వరకు 9 మందిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. నిందితులను గుర్తించి పట్టుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోందని మల్కాజిగిరి పోలీస్‌  కమిషనర్ సుమతి తెలిపారు. సమావేశంలో ఎల్బీనగర్ డీసీపీ అనురాధ, క్రైమ్ డీసీపీ అరవింద్, ఎల్బీనగర్ ఏసీపీ రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

- ఒయాసిస్‌ చైర్మన్‌ సూర్యకిరణ్‌ కోసం గాలింపు

సద్గురు హెల్త్ కేర్ సంస్థ ద్వారా చట్టవిరుద్ధ కార్యకలాపాలు నిర్వహించిన ప్రధాన నిందితులలో ఒకడైన వెంకట సూర్య కిరణ్ గేదెల ఇతర కంపెనీల్లో కూడా డైరెక్టర్ గా వ్యవహరించాడు. సద్గురు సాప్ట్ వేర్ సంస్థలో సూర్యకిరణ్ తోపాటు మాజీ మంత్రి కేటీఆర్ సతీమణి శైలిమా కల్వకుంట్ల కూడా గతంలో కొంతకాలం పాటు డైరెక్టర్ గా ఉన్నారు. దీంతో పాటు సూర్యకిరణ్ ఆధ్వర్యంలో కొనసాగిన జెన్మెడ్ హెల్త్ కేర్ సంస్థలో కూడా శైలిమ డైరెక్టర్ గా కొంతకాలం కొనసాగారని సమాచారం. కాగా, ఒయాసిస్‌ ఫెర్టిలిటీ సెంటర్…

మరిన్ని వార్తలు