త్వరలో రాష్ట్ర బీజేపీలో మార్పులు చేర్పులు
- సంస్థాగతంగా పార్టీ బలోపేతానికి చర్యలు
- అధికారమే లక్ష్యంగా ఇప్పటి నుంచే కసరత్తు
- రాష్ట్ర కమిటీలో మరికొందరికి చోటు.. కొంద్దరికి స్థానచలనం!
నవంబర్ 7 (విజయక్రాం తి): రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా బీజేపీ(BJP) లో పలు కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తున్నది. తొలుత సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు హైకమాండ్ కసరత్తు చేస్తున్నది. రాష్ట్ర కమిటీలో మరికొన్ని పదవులను భర్తీ చేయాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. గతంలో పదవులు ఆశించి అసంతృప్తిలో ఉన్న వారికి పదవులు కల్పిం చి బుజ్జగించాలని యోచిస్తున్నది.
మార్పులు చేర్పులు
తెలంగాణ బీజేపీలో(Telangana BJP) ప్రస్తుతం ముగ్గురు జనరల్ సెక్రటరీలు ఉన్నారు. అలాగే ఎనిమిది మంది సెక్రటరీలు, ఎనిమిది మంది ఉపాధ్యక్షులున్నారు. అయితే వీటికి అదనంగా ఒకరిద్దరు జనరల్ సెక్రటరీలతోపాటు ఇద్దరు సెక్రటరీలు, ఇద్దరు ఉపాధ్యక్షులను నియమించే అవకాశాలను పార్టీ పరిశీలిస్తున్నది. అదేవిధంగా ఒకరిద్దరిని తొలగించి ఈ రకంగా మార్పులు, చేర్పులు చేసి పార్టీని బలోపేతం చేయాలన్న ఆలోచనలో హైకమాండ్ ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే హైదరాబాద్‌లో కేంద్ర హోంశాఖ మం త్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) పర్యటించారు.
ఆయన చేపట్టిన పాదయాత్రకు భారీగా జనం తరలివచ్చారు. దీపావళి త ర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్(Nitin Nabin) కరీంనగర్‌కు రానున్నా రు. కాంగ్రెస్‌పై జనంలో వ్యతిరేకత ఉం దని, అది తమకు అనుకూలంగా మలచుకోవాలని బీజేపీ భావిస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతున్నది. ఈ క్రమంలోనే బీజేపీ రాష్ట్ర కమిటీని మరింత బలోపే తం చేసి రాజకీయంగా ఇతర పార్టీలను గట్టిగా ఎదుర్కోవాలని కమలనాథులు భావిస్తున్నారు
పనితీరుపై నివేదికలు
తెలంగాణలో ఇప్పటి నుంచే గట్టిగా ఫోక స్ పెడితే రాబోయే రోజుల్లో మంచి ఫలితాలను సాధించొచ్చని బీజే పీ జాతీయ నాయకత్వం భావిస్తున్నది. అయితే పా ర్టీ నాయకుల పనితీరుపై ఎప్పటికప్పుడు ఢిల్లీకి నివేదికలు వెళ్తున్నాయి. పనిచే యనప్పుడు పార్టీ పదవులెందుకని ఇప్పటికే నేతల కు పార్టీ ఇన్‌చార్జి సునీల్ బన్సల్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. కొందరి పనితీరుపై పార్టీలో అంతర్గతంగా సమీక్ష జరుగుతున్నది. సంస్థాగత కార్యక్రమాల్లో చురుకుదనం, పార్టీ నిర్దేశించిన బాధ్యతల నిర్వహణ వంటి అంశాలను ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉంది.
ఎవరికి పదవులు ఊడతాయి.. ఎవరికి దక్కుతాయి.. అనే ది త్వరలోనే తేలనుంది. కొత్తగా పార్టీలో మరికొందరికి పదవులు దక్కుతాయనే ప్రచా రంతో ఆశావహులు తమ ప్రయత్నాలు చేపట్టినట్లు తెలుస్తున్నది. ఢిల్లీ స్థాయిలో తమకున్న పరిచయాలతో లాబీయింగ్ చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. కేవలం కొత్త వారికి పదవులు ఇవ్వడమే కాదు.. ప్రత్యేక బాధ్యతలను కూడా పార్టీ అధిష్టానం కట్టబెట్టనున్నట్లు ప్రచారంలో ఉంది.
క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకుగానూ జిల్లాల వారీ గా పార్టీ బాధ్యతలు, సంస్థాగత విస్తరణ, ప్రజా సమస్యలపై పోరాటాలు, వివిధ మో ర్చాల సమన్వయం వంటి అంశాలకు ప్రాధా న్యం ఇవ్వనున్నట్లు తెలుస్తున్నది. కేవలం రాజకీయ కార్యక్రమాలు, ప్రజా పోరాటాలకే పరిమితం కాకుండా భవిష్యత్తులో జరిగే ఎన్నికలను దృష్టిలో పెట్టి సంస్థా గతంగా కూడా పార్టీని బలోపేతం చేయాలని బీజేపీ జాతీయ నాయకత్వం భావిస్తు న్నది. బలమైన నాయకత్వం ఉంటే బలమైన క్యాడర్ ను తయారు చేయొచ్చనే ఆలోచనతో ముం దుకు వెళ్తున్నట్లు తెలుస్తున్నది.