కొల్లూరు పీఎస్ పరిధిలో డ్రగ్స్ పట్టివేత

14-11-2026 | 04:37pm

రామచంద్రపురం నవంబర్ 14: రామచంద్రపురం మండలం(Ramachandrapuram Mandal) కొల్లూరు పి ఎస్ పరిధిలో పోలీసుల పరివేక్షణలో(Police supervision) పోలీసులకు నమ్మిదాగిన సమాచారం ప్రకారం  డ్రగ్స్(Drugs) ఉన్న కారు ను పట్టుకున్నారు.బెంగుళూరు నుంచి హైదరాబాద్ కు తీసుకువచ్చి డ్రగ్స్ విక్రయం నిందితుడిని పట్టుకున్న నార్సింగి ఎస్ ఓ టీ(Narsingi SOT), కొల్లూరు పోలీసులు.  

నెల్లూరుకు చెందిన జి. వెంకట సాయి చరణ్ బెంగుళూరు నుంచి తెచ్చి ఎం.డి.ఎం.ఎ  డ్రగ్స్ విక్రయం.నిందితుని నుంచి 5.5 గ్రాముల ఎం.డి.ఎం.ఎ  డ్రగ్స్, బెలెనో కారు, మొబైల్ ఫోన్ ను స్వాధీనం చెసుకున్నారు.నమ్మదగిన సమాచారం మేరకు కొల్లూర్ పోలీస్ వారు ఓ.ఆర్.ఆర్ ఎగ్జిట్ 2 నుండి వస్తుండగా తెల్లాపూర్ గద్దర్ సర్కిల్ సమీపంలో దాడి నిర్వహించి, బెంగళూరుకు చెందిన గొసంగి వెంకట సాయి చరణ్  అనే వ్యక్తిని KA 53 MQ 1707 నంబరు గల బ్లూ కలర్ బాలెనో కారులో పట్టుకున్నారు.

అతని వద్ద నుండి 5 గ్రాముల ఎం.డి.ఎం.ఎ  మత్తు పదార్థం, ఒక మొబైల్ ఫోన్ మరియు నేరానికి ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితుడు బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి వద్ద నుండి రూ.12,000/-లకు  ఎం.డి.ఎం.ఎ కొనుగోలు చేసి, హైదరాబాద్‌లో ఇద్దరు వ్యక్తులకు విక్రయించడానికి వచ్చినట్లు వెల్లడించాడు.  ఈ ఘటనపై ఎన్.డి.పి.ఎస్  చట్టంలోని సంబంధిత సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేయబడింది.ఎం.డి.ఎం.ఎ. సరఫరాదారు మరియు కొనుగోలుదారులను గుర్తించి పట్టుకోవడానికి తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. అరెస్ట్ చేసన నిందితుని రేమండ్ కు తరలించబడినధి...

మరిన్ని వార్తలు