పటాన్ చెరులో అభివృద్ధి పనులకు శ్రీకారం
14-11-2026 | 04:30pm
పటాన్ చెరు, నవంబర్ 14 : పటాన్ చెరు నియోజకవర్గ అభివృద్ధిలో(Development of Patancheru Constituency) భాగంగా పలు కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి(MLA Gudem Mahipal Reddy) ఆధ్వర్యంలో శనివారం శంకుస్థాపనలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో మాద్రి పృథ్వీరాజ్ పాల్గొన్నారు. గౌతమ్ నగర్, గోకుల్ నగర్, శాంతినగర్, శ్రీనగర్, జేపీ కాలనీ, శ్రీరామ్ నగర్, ఆల్విన్ కాలనీల్లో సీసీ రోడ్లు, వర్షపు నీటి కాలువలు, డ్రైనేజీ పైపులైన్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. కాలనీల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యమని నాయకులు తెలిపారు.