సీఎం సభను జయప్రదం చేయాలి

18-11-2026 | 12:57pm

మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కాషాబోయిన భాస్కర్

చేగుంట,(విజయక్రాంతి): తెలంగాణ ముఖ్యమంత్రి సిద్దిపేట జిల్లా(Siddipet District)లో పాల్గొనే బహిరంగ సభను విజయవంతం చేయాలని చేగుంట మండల కాంగ్రెస్ అధ్యక్షులు కాషాబోయిన భాస్కర్(Mandal Congress President Kashaboyna Bhaskar) పిలుపునిచ్చారు. బుధవారం చేగుంటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... మండలంలోని ప్రతి గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీ(Congress Party) నాయకులు, కార్యకర్తలు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు,  మాజీ ప్రజా ప్రతినిధులు సీనియర్ నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సీఎం సభను జయప్రదం చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, సభకు ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు