రజక సమాజ ఐక్యతకు కృషి చేయాలి

07-10-2026 | 09:43pm

మండల రజక సంఘం నియామకం 

కోహెడ, అక్టోబర్ 7,(విజయ క్రాంతి): రజక సమాజాన్ని సంఘటితం చేసి హక్కుల సాధనకు కృషి చేయాలని తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి(Telangana Rajaka Reservation Samithi) రాష్ట్ర అధ్యక్షుడు గోపి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్ గణేష్ అన్నారు. కోహెడలో రజక సంఘం నూతన కమిటీ ఏర్పాటు సందర్భంగా వారు మాట్లాడారు. రజక కుటుంబాల సంక్షేమం, యువత, మహిళల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పనిచేయాలని సూచించారు.

సిద్దిపేటలో జరగనున్న 4వ మహాసభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్బంగా నూతన రజక మండల కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా నంగునూరి శ్రీనివాస్, గౌరవ అధ్యక్షునిగా జాలిగాం చంద్రయ్య, యూత్ అధ్యక్షునిగా గడ్డం అంకుశ్, ఉపాధ్యక్షుడిగా గడ్డం ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శిగా పున్నం రాజు, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా జాలిగాం రవి, కోశాధికారిగా ఉప్పరపల్లి రాజు, కార్యదర్శిగా బస్వరాజ్ రాకేష్‌ ఎన్నికయ్యారు.

మరిన్ని వార్తలు