151 సెల్ ఫోన్ల రికవరీ

07-10-2026 | 09:53pm

సీపీ రష్మీ పెరుమాళ్

సిద్దిపేట క్రైం, అక్టోబర్ 7 (విజయక్రాంతి) : చోరీకి గురైన, పోగొట్టుకున్న 151 మొబైల్ ఫోన్లను సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రార్ పోర్టల్(Central Equipment Identity Register Portal) ద్వారా ట్రాక్ చేసి బాధితులకు అప్పగించినట్లు సీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. చరవాణి  పోగొట్టుకుంటే ఆందోళన చెందవద్దని సీఈఐఆర్ ద్వారా తిరిగి పొందవచ్చన్నారు. పోగొట్టుకున్న 151 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని బాధితులకు బుధవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో అప్పగించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, బాధితులు చరవాణి ఎలా పోగొట్టుకున్నారని అడిగి తెలుసుకున్నారు.

ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 670 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించినట్టు తెలిపారు. ఎవరికైనా ఎక్కడైనా చరవాణి దొరికితే సంబంధిత పోలీస్ స్టేషన్లో లేదా సంబంధిత యజమానికి  అప్పగించాలని సూచించారు.

సాంకేతికతను ఉపయోగించి మొబైల్ ఫోన్లు రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన సీఈఐఆర్ బృందం, ఇన్స్పెక్టర్ మొగిలి, ఆర్ఎస్ఐ నిరంజన్, కానిస్టేబుల్  రమేశ్, రాజిరెడ్డి , హరికృష్ణ, స్వామి, శ్రీకాంత్ లను సీపీ అభినందించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ అడ్మిన్ కుశాల్కర్, అదనపు డీసీపీ ఏఆర్ సుభాష్ చంద్రబోస్, సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్ ఏసీపీలు రవీందర్, నర్సింలు, సదానందం పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు